Jabardasth Ram Prasad : కేటీఆర్ ఎదురుగుండానే.. సుడిగాలి సుధీర్ పరువు తీసేసిన ఆటో రాంప్రసాద్ వీడియో వైరల్…!!

Advertisement

Jabardasth Ram Prasad : తెలుగు చలనచిత్ర రంగంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన వేణు అందరికీ సుపరిచితుడే. నవదీప్ హీరోగా నటించిన జై.. ఇంకా తేజ సినిమాలలో అదేవిధంగా దిల్ రాజు ప్రభాస్ కలయికలో వచ్చిన సినిమాలో వేణు కీలక పాత్ర పోషించారు. జబర్దస్త్ స్టార్టింగ్ లో వేణు టీం లీడర్ గా వ్యవహరించడం జరిగింది. అప్పట్లో ఆయన టీంలో సుడిగాలి సుదీర్, గెటప్ శీను, రాంప్రసాద్ టీమ్ మెంబర్స్. అయితే వేణు వెళ్లిపోయాక ఈ ముగ్గురు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కాగా ఇప్పుడు వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మారడం జరిగింది.

Advertisement
Jabardasth Ram Prasad Making Fun With Sudigali Sudheer On Stage
Jabardasth Ram Prasad Making Fun With Sudigali Sudheer On Stage

తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంకీ చెందిన వేణు.. తాను మొదటి క్యారెక్టర్ చేసిన సినిమా ప్రీ రిలీజ్ వేడుక సొంత ఊరిలోనే నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకు రాంప్రసాద్, సుడిగాలి సుదీర్, చమ్మక్ చంద్ర వచ్చారు. ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. “బలగం” ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని తెలిపారు. ఇక ఇదే సమయంలో

Advertisement
Jabardasth Ram Prasad Making Fun With Sudigali Sudheer On Stage
Jabardasth Ram Prasad Making Fun With Sudigali Sudheer On Stage

బలగం సినిమా చూస్తున్న టైం లో సినిమాలో ఐటెం సాంగ్స్ లేవా అని సుధీర్ తనని ప్రశ్నించినట్లు రాంప్రసాద్ చెప్పుకొచ్చాడు. అయితే సుధీర్ కోసం బలగం 2 తీయండి అని నిర్మాతలను కోరారు. ఆ ప్రశ్న సుధీర్ తనని అడిగిన టైంలో ఇది నువ్వు.. చేసే టైపు సినిమా కాదు అని చెప్పడం జరిగిందని అనడంతో కేటీఆర్ తో పాటు దర్శకులు నిర్మాతలు ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఆటో రాంప్రసాద్ పంచ్ ఒక్కసారిగా సుడిగాలి సుదీర్ పరువు తీసేసినట్టు అయింది.

Advertisement
Advertisement