Sai Pallavi : సాయి పల్లవి తిరష్కరణ ఖరీదు రూ.50 కోట్లు… ఇలాంటి హీరోయిన్‌ను ఎప్పుడూ చూడలేదు

Authored By aruna | The Telugu News | Published on: August 3, 2022, 5:40 pm

Sai Pallavi : తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి ఇప్పుడు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయేలా ఆలోచించేటట్టు చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు ఏమీ లేకపోవడంతో అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఇంత క్రేజ్ సాయి పల్లవి ఎందుకు సినిమాలు కమిట్ అవ్వడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. సాయి పల్లవికి ఏమైనా మైండ్ చెడిపోయిందా అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమాల కంటే డాక్టర్ వృత్తి పైనే మక్కువ ఎక్కువ ఉన్నట్టు ఉందిగా అంటున్నారు. సాయి పల్లవి నో చెబుతున్నా కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయినా కూడా వాటికి నో చెబుతూ వస్తోంది.

సినిమాలు మరియు వెబ్ సిరిసిల్లో కూడా ఆఫర్లు పెద్ద పెద్ద అమౌంట్ లతో వస్తున్నాయి, కానీ ఆమె మాత్రం సున్నితంగా వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు సాయి పల్లవి తిరస్కరించిన వెబ్ సిరీస్ లు మరియు సినిమాల ద్వారా సినిమా ఈమె మిస్ అయిన పారితోషికం ఏకంగా రూ. 50 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 50 కోట్లు అంటే మామూలు విషయం కాదు, సాదారణ హీరోయిన్ కెరీర్‌ మొత్తం కూడా అంతా సంపాదించడం కష్టం అయినా కూడా సాయి పల్లవి చాలా ఈజీగా ఆ ఆఫర్లను తిరష్కరించి సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంది.

why Sai Pallavi not doing back to back movies with commercial stories

why Sai Pallavi not doing back to back movies with commercial stories

సాయి పల్లవి చివరిగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఒక సినిమా వచ్చింది కాని జనాలు ఆ సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు. అసలు సాయి పల్లవి ఆ సినిమాలో నటించింది అనే విషయాన్ని కూడా చాలా మంది గుర్తించడం లేదు. అలాంటి సినిమాలు చేస్తుంది కాని కమర్షియల్ గా వందల కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న సినిమాలకు మాత్రం నో చెబుతుంది. ఆ మధ్య చిరంజీవి సినిమాకు నో చెప్పింది.. ఆ తర్వాత తమిళ స్టార్‌ హీరో అజిత్ సినిమా లో నటించేందుకు నో చెప్పిందట. ఇలా హిందీ నుండి సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా వచ్చిన ఆఫర్లు తిరష్కరించిందని సమాచారం. సాయి పల్లవి వంటి హీరోయిన్‌ ను ఎప్పుడు చూడలేదు అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp