Sreemukhi : జబర్దస్త్ ని రెండవ సారి శ్రీముఖి ఎందుకు కాదన్నదో తెలుసా..!
Sreemukhi : ఈటీవీ మల్లెమాల వారు 10 సంవత్సరాల క్రితం జబర్దస్త్ కామెడీ షో ప్రారంభించిన సమయంలో యాంకర్ గా శ్రీముఖి ని మొదట సంప్రదించడం జరిగిందట. కొన్ని కారణాలవల్ల ఆ సమయంలో శ్రీముఖి నో చెప్పింది. దాంతో అనసూయకి ఆ ఛాన్స్ దక్కింది. కొత్త పేస్ అయినా కూడా ప్రేక్షకులు ఆమెను ఆదరించారు, ఆమె కూడా ప్రేక్షకులను సాధ్యమైనంత వరకు ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నించింది. దాంతో మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినా దాదాపుగా పది సంవత్సరాల పాటు ఆమె జబర్దస్త్ యాంకర్ గా కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆమె జబర్దస్త్ నుండి వెళ్లి పోయింది. మల్లెమాల కి గుడ్ బై చెప్పేసి, ఈటీవీ లో కార్యక్రమాలన్నింటిని వదిలేసి స్టార్ మా కి జంప్ ఆయన విషయం తెలిసిందే.
మల్లెమాల మరియు ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమాలను అనసూయ వదిలేసి వెళ్లిన సమయంలో ఆమె స్థానంలో భర్తీ చేసేందుకు మళ్లీ ఒకసారి శ్రీముఖిని సంప్రదించడం జరిగిందట. గతంలో శ్రీముఖి జబర్దస్త్ అవకాశాన్ని వదులుకున్నందుకు బాధపడ్డానంటూ వ్యాఖ్యలు చేసింది. కనుక ఈసారి ఆమెకు అవకాశం వస్తే తప్పకుండా వదిలేయదు అని అంతా భావించారు, కానీ ఆమె తాను జబర్దస్త్ కార్యక్రమంలో చేయలేనంటూ చెప్పిందంట. అందుకు కారణం కూడా ఆమె ఇంట్రెస్టింగ్ గా చెప్పిందని మల్లెమాల వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇంతకు ఆమె చెప్పిన కారణమేంటంటే.. జబర్దస్త్ కార్యక్రమానికి తాను యాంకర్ గా వ్యవహరిస్తే మల్లెమాల వారికి బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తాను ఒక ఈటీవీకి పరిమితం అవ్వాలని కోరుకోవడం లేదు అన్ని, ఎంటర్టైన్మెంట్ చానల్స్ తో పాటు యూట్యూబ్లో కూడా తాను సందడి చేయాలని అనుకుంటున్నాను అందుకే తాను బాండ్ కి కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదు అందట.
ఇతర ఛానల్ లో అవకాశం వచ్చినప్పుడు చేస్తాను, లేదంటే ఖాళీగా ఉంటాను. అంతే తప్పితే జబర్దస్త్ కోసం మల్లెమాల వారికి కట్టు బానిసగా మారే ఉద్దేశం లేదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేసిందట. బాండ్ ఇస్తే కట్టు బానిస అన్నట్లుగానే ఆ మధ్య జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన కొందరు కమెడియన్సు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మరీ అంతా కఠినమైన పదం వాడడం సరికాదు. కానీ ఒక సంస్థ తమ వద్ధ చేసే వారితో బాండ్ చేసుకోవడం అనేది సరైనదే కనుక మల్లెమాల వారు బాండ్ కి ఒప్పించడం కరెక్టే.. అలాగే నాలుగు చానల్స్ తిరగాలనుకునే వారు ఆ బాండ్ కాదని కార్యక్రమాన్ని వద్దనుకోవడం కరెక్టే.. కనుక శ్రీముఖి కార్యక్రమాన్ని వద్దు అనుకోవడంలో తప్పేం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.