Allu Arjun – Taraka Ratna : అల్లు అర్జున్, తారకరత్న మధ్య గొడవలు.. ఇద్దరి మధ్య ఏం జరిగింది..?
Allu Arjun – Taraka Ratna : మహాశివరాత్రి నాడే నందమూరి తారకరత్న మృతి చెందారు. ఈనేపథ్యంలో టాలీవుడ్ లోనే కాదు.. దేశమంతా ప్రస్తుతం తారకరత్న గురించే మాట్లాడుకుంటున్నారు. బెంగళూరులో ఆయన ట్రీట్ మెంట్ ప్రారంభం అయినప్పటి నుంచి తారకరత్న గురించి చర్చిస్తున్నారు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు ఆయన. ఇంత చిన్న వయసులో తారకరత్న ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. దీంతో నందమూరి కుటుంబాన్ని, నందమూరి ఫ్యాన్స్ ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. నిజానికి తారకరత్న మల్టీ టాలెంటెడ్.
ఆయన హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా అన్ని పాత్రల్లో అవలీలగా నటించేయగలరు. అందుకే ఆయన తొలి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు దర్శకుడు కోదండరామిరెడ్డి. అయితే.. దర్శకధీరుడు రాఘవేంద్రరావు తన 100వ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్న సమయంలోనే ఆ సినిమాను పెద్ద హీరోతో తీయాలని అనుకున్నారట రాఘవేంద్రరావు. అయితే.. అల్లు అర్జున్ ను లాంచ్ చేయాలని అల్లు అరవింద్.. రాఘవేంద్రరావును అడిగారట. అదే టైమ్ లో నందమూరి మోహన కృష్ణ కూడా తన కొడుకు తారకరత్నను ఇంట్రడ్యూస్ చేయాలని రాఘవేంద్రరావును కలిశారట. ఇద్దరిలో ఒకరితోనే సినిమా చేయాలి కాబట్టి.. అప్పుడు బన్నీని సెలెక్ట్ చేసుకున్నాడట రాఘవేంద్రరావు.
Allu Arjun – Taraka Ratna : బన్నీని సెలెక్ట్ చేసుకున్న రాఘవేంద్రరావు
దీంతో మోహన్ కృష్ణ.. బాలకృష్ణతో మాట్లాడారట. దీంతో బీ గోపాల్, సింగీతం శ్రీనివాసరావు ఇద్దరిలో ఎవరో ఒక డైరెక్టర్ తో తారకరత్న సినిమా ప్లాన్ చేద్దాం అని చెప్పారట బాలయ్య. కానీ.. ఆ దర్శకుడు కూడా నో చెప్పడంతో చివరకు కోదండరామిరెడ్డితో తారకరత్న తొలి మూవీ ప్లాన్ చేశారు. అలా.. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తెరకెక్కింది. మరోవైపు రాఘవేంద్రరావు తన 100వ సినిమా గంగోత్రిని బన్నీతో ప్లాన్ చేశారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే.. దానికంటే ఎక్కువ రేంజ్ లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా హిట్ అయింది. అలా.. అల్లు అర్జున్, తారకరత్న ఇద్దరి మధ్య డెబ్యూ సినిమాల విషయంలో వార్ జరిగిందన్నమాట.