Wild dog : వైల్డ్ డాగ్ సినిమాతో ఇటీవల నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఎన్.ఐ.ఏ ఆఫీసర్ అజయ్ వర్మ పాత్రలో కనిపించాడు. వాస్తవం సంఘటనల ఆధారంగా కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి దియా మిర్జా, సయామీ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా రిలీజైన మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. నాగార్జున కెరీర్ లో బెస్ట్ సినిమా అంటూ పలువురు ప్రశంసలతో ముంచేశారు. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల అనుకున్న స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది.
దాంతో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాని ప్రమోట్ చేశాడు. వైల్డ్ డాగ్ సినిమాకు స్వయంగా రివ్యూను సోమవారం ప్రెస్ మీట్‌లో రిలీజ్ చేశాడు. ఇలాంటి సినిమా నాగార్జున తప్ప మరెవరూ చేయలేరంటూ మెగాస్టార్ ఈ సక్సస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు. వాస్తవంగా అభిమానులను నాగార్జున వైల్డ్ డాగ్ బాగానే ఆకట్టుకుంది. కానీ వసూళ్ళు చూస్తే మాత్రం షాకింగ్ గా ఉన్నాయి. చివరికి మెగాస్టార్ చేసిన ప్రచారం కూడా పెద్దగా వైల్డ్ డాగ్ సినిమాకి ఉపయోగపడలేదన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 9.5 కోట్ల బ్రేకీవెన్ ఉండగా అది రాబట్టం కాస్త కష్టమే అంటున్నారు.
అయితే ఈ సినిమా ప్రభావం కాస్త ఆచార్య మీద పడనుందని చెప్పుకుంటున్నారు. ఈ రెండు సినిమాలని నిర్మిస్తుంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి. వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ప్రభావం పడటంతో ఆచార్య విడుదల తేదీ మేకర్స్ లో ఆందోళన కలిగిస్తుందని చెప్పుకుంటున్నారు. అలాగే మళ్ళీ లాక్డౌన్ అంటూ పుకార్లు కూడా వినిపిస్తుండటంతో నిర్మాతలకు టెన్షన్ మొదలైందట. ఇప్పటికే ఆచార్య షూటింగ్ తో పాటూ వీఎఫెక్స్ వర్క్ కూడా పెండింగ్ ఉండటంతో ఆచార్య పోస్ట్ పోన్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు వైల్డ్ డాగ్ ఎఫెక్ట్ కూడా పడనుందట.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.