Wild dog : వైల్డ్ డాగ్ కలెక్షన్స్ వీక్..ఆచార్యకి మరో దెబ్బ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wild dog : వైల్డ్ డాగ్ కలెక్షన్స్ వీక్..ఆచార్యకి మరో దెబ్బ..?

 Authored By govind | The Telugu News | Updated on :7 April 2021,11:30 am

Wild dog : వైల్డ్ డాగ్ సినిమాతో ఇటీవల నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఎన్.ఐ.ఏ ఆఫీసర్ అజయ్ వర్మ పాత్రలో కనిపించాడు. వాస్తవం సంఘటనల ఆధారంగా కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి దియా మిర్జా, సయామీ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా రిలీజైన మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. నాగార్జున కెరీర్ లో బెస్ట్ సినిమా అంటూ పలువురు ప్రశంసలతో ముంచేశారు. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల అనుకున్న స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది.

wild dog collections are weak

wild-dog-collections-are-weak

దాంతో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాని ప్రమోట్ చేశాడు. వైల్డ్ డాగ్ సినిమాకు స్వయంగా రివ్యూను సోమవారం ప్రెస్ మీట్‌లో రిలీజ్ చేశాడు. ఇలాంటి సినిమా నాగార్జున తప్ప మరెవరూ చేయలేరంటూ మెగాస్టార్ ఈ సక్సస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు. వాస్తవంగా అభిమానులను నాగార్జున వైల్డ్ డాగ్ బాగానే ఆకట్టుకుంది. కానీ వసూళ్ళు చూస్తే మాత్రం షాకింగ్ గా ఉన్నాయి. చివరికి మెగాస్టార్ చేసిన ప్రచారం కూడా పెద్దగా వైల్డ్ డాగ్ సినిమాకి ఉపయోగపడలేదన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 9.5 కోట్ల బ్రేకీవెన్ ఉండగా అది రాబట్టం కాస్త కష్టమే అంటున్నారు.

Wild dog : ఆచార్య పోస్ట్ పోన్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా ప్రభావం కాస్త ఆచార్య మీద పడనుందని చెప్పుకుంటున్నారు. ఈ రెండు సినిమాలని నిర్మిస్తుంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి. వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ప్రభావం పడటంతో ఆచార్య విడుదల తేదీ మేకర్స్ లో ఆందోళన కలిగిస్తుందని చెప్పుకుంటున్నారు. అలాగే మళ్ళీ లాక్డౌన్ అంటూ పుకార్లు కూడా వినిపిస్తుండటంతో నిర్మాతలకు టెన్షన్ మొదలైందట. ఇప్పటికే ఆచార్య షూటింగ్ తో పాటూ వీఎఫెక్స్ వర్క్ కూడా పెండింగ్ ఉండటంతో ఆచార్య పోస్ట్ పోన్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు వైల్డ్ డాగ్ ఎఫెక్ట్ కూడా పడనుందట.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది