Home » News » Bandi Sanjay Participates In Bjp Foundation Day Celebrations
News

Band Sanjay : టీఆర్ఎస్ ను మట్టికరిపించే పార్టీ బీజేపీ మాత్రమే? స్పష్టం చేసిన బండి సంజయ్?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: April 7, 2021, 10:21 am
Advertisement

Bandi Sanjay : బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ బీజేపీకి పెద్ద దిక్కు ఆయనే. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ కాస్తో కూస్తో బలోపేతం అయిందంటే దానికి కారణం బండి సంజయ్. కరీంనగర్ ఎంపీగానే కాకుండా… బండి సంజయ్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.

Advertisement

bandi sanjay participates in bjp foundation day celebrations

ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని ఓడించి… బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తున్నారు. తాజాగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ తెలంగాణ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్…. టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

Advertisement

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొని మట్టికరిపించే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గడిల పాలనను అంతం చేసే పార్టీ కేవలం బీజేపీ మాత్రమేనని…. 2023 లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Bandi Sanjay : బీజేపీ లేని పార్టీని దేశ ప్రజలు ఊహించుకోలేరు

అసలు… బీజేపీ లేని పార్టీని దేశ ప్రజలు ఊహించుకోలేరని… ఎక్కడో 2 స్థానాలు గెలిచిన చోటు నుంచి ఇప్పుడు 303 స్థానాలను గెలిచిన చోటుకు బీజేపీ చేరుకుందని బండి సంజయ్ అన్నారు.

Advertisement

అధికారం కోసమో… మరి ఇంకేదో పదవుల కోసమో బీజేపీ ఎప్పుడూ పనిచేయలేదు. బీజేపీ కేవలం పేద ప్రజల కోసం పనిచేసింది. దేశం కోసం పనిచేసింది. దేశం కోసం బీజేపీ అధికారంలోకి రావాలనుకుంది.. అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కేవలం ఒక్క ఓటుతో అధికారాన్ని కూడా వదులుకున్న ఘనత అటల్ బిహారీ వాజ్ పేయ్ ది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్రం ప్రవేశపెడుతోంది. బీజేపీ ఎక్కడుంటే అక్కడ ఉగ్రవాదం, తీవ్రవాదం అంతం అవుతుంది… అని బండి సంజయ్ ఈ సందర్భంగా తెలిపారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి