Regina Cassandra – Acharya : రెజీనాకు చిరంజీవి లైఫ్ ఇవ్వబోతున్నాడా..?
Regina Cassandra – Acharya: రెజీనా కసాండ్ర..టాలీవుడ్‌లో ఒక దశలో అందరూ యంగ్ హీరోలతో హీరోయిన్‌గా సినిమాలు చేసి హిట్స్ అందుకున్న బ్యూటీ. సుధీర్ బాబు హీరోగా పరిచయమైన శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వార రొటీన్ లవ్ స్టోరి, పిల్లా నువ్విలేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్, కొత్త జంట లాంటి సినిమాలతో వరుసగా హిట్స్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది రెజీనా. మంచి పర్ఫార్మెన్స్‌తో పాటు గ్లామర్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఎక్కువగా యంగ్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది.
అయితే, అనూహ్యంగా రెజీనా కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు వచ్చాయి. అలాగే, వరుసగా రెజీనా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి. దాంతో అమ్మడికి ఎంత గ్లామర్ రోల్స్ చేసి బోల్డ్‌గా కనిపించినా లాభం లేకుండా పోయింది. నక్షత్రం లాంటి సినిమాలో ఓవర్ డోస్ గ్లామర్ మిటర్ పెంచినా కూడా ఫలితం లేకుండా పోయింది. మధ్యలో ఎవరు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేసి హిట్ అందుకున్నా కూడా హీరోయిన్‌గా తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. అయితే, తమిళంలో మాత్రం సాలీడ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది.

will acharya- help to get chances to regina-cassandra
Regina Cassandra – Acharya: మెగాస్టార్ రెజీనాకు ఎలాంటి క్రేజ్ తీసుకురాబోతున్నారో.
కరోనా కారణంగా గత రెండేళ్ళ నుంచి రెజీనా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు తెలుగులో అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఆయనతో కలిసి ఓ అద్భుతమైన ఐటెం సాంగ్ చేసే అవకాశం అందుకుంది. ఇప్పటికే, ఈ సాంగ్ లిరికల్ వీడియో వచ్చి అందరినీ ఆకట్టుకుంది. మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నటించినా ఐటెం సాంగ్‌లో మెరిసిన ఆ హీరోయిన్‌కు కొంతకాలం మంచి అవకాశాలు అందుతుంటాయి. ఇప్పుడు రెజీనా విషయంలో కూడా అభిమానులు అదే మాట్లాడుకుంటున్నారు. ఆచార్య సినిమా తర్వాత గ్యారెంటీగా రెజీనాకు సీనియర్ హీరోల సినిమాలలోనైనా అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి మెగాస్టార్ రెజీనాకు ఎలాంటి క్రేజ్ తీసుకురాబోతున్నారో.