Akkineni Akhil : అక్కినేని హీరోకు మరో హిట్ దక్కేనా..?

Authored By vamana sai | The Telugu News | Published on: May 31, 2022, 5:30 pm

Akkineni Akhil  : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా వైపు చూడని హీరోలెవరైనా ఉన్నారంటే అది అక్కినేని హీరోలు మాత్రమే. వారికి కావాల్సింది పక్కా కమర్షియల్ హిట్ సినిమాలు. అన్నపూర్ణ సంస్థ నిర్మించే చిత్రాలు మంచి కమర్షియల్ హిట్ అయి లాభాలొస్తే చాలు..అనేట్టుగా ఉన్నారు. ఒకరకంగా ఇది నిజమే అనుకోవచ్చు. పాన్ ఇండియన్ సినిమాలంటూ ఈ మధ్య కాలంలో వచ్చినవేవీ ఆశించిన సక్సెస్‌లను అందుకోలేదని చెప్పొచ్చు. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సహా ఏ భారీ భడ్జెట్ సినిమాకు వచ్చిన లాభాలు, వసూళ్ళు కరెక్ట్ కాదనే వాదన గట్టిగానే వినిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ కొన్ని చోట్ల బ్రేకీవెన్ కూడా రీచ్ కాలేదు. కానీ, అన్ని వందల కోట్లు ఇన్ని వందల కోట్లు అని మాత్రం మేకర్స్, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టర్స్ వేసి ఊదరగొట్టారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఒక్కటే మంచి లాభాలను పొందిందని టాక్. ఎందుకంటే ఈ సినిమాను నిర్మాతలు దాదాపు అనుకున్నంత బడ్జెట్‌లోనే నిర్మించడం వల్లనే అది సాధ్యమైంది. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల కేజీఎఫ్ 2 అనుకున్నదానికంటే కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. పాన్ ఇండియన్ సినిమా కాకపోయినా ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు ఫ్లాప్స్‌గా మిగిలాయి. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ అన్నారే గానీ, చివరికీ 20 కోట్ల వరకూ లాస్ అనేది టాక్.

Will Akkineni Akhil get another hit

Will Akkineni Akhil get another hit

Akkineni Akhil : అఖిల్ ముందున్న టార్గెట్..అర్జెంటుగా పాన్ ఇండియా హీరో..?

ఇక ఎఫ్ సినిమా పరిస్థితీ అంతే. అందుకే, అక్కినేని హీరోలు చాలా సేఫ్‌గా సినిమాలు చేస్తున్నారు. మూడు ఫ్లాపుల తర్వాత అఖిల్ ఓ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడమే అఖిల్ ముందున్న టార్గెట్ తప్ప అర్జెంటుగా పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలనేది కాదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సినిమా ప్రస్తుతం మనాలిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో అఖిల్ మరో హిట్ అందుకుంటాడా..? అనే ఇప్పుడు అంతటా టాక్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సూరి సినిమాలు భారీ హిట్ సాధిస్తాయి. లేదంటే ఫ్లాప్ గ్యారెంటీ. అందుకే, అఖిల్ ఖాతాలో రెండవ హిట్ పడుతుందా..! అనే ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఏమవుతుందో ఏజెంట్ రిలీజైతే గానీ తెలియదు.

vamana sai

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp