Home » Entertainment » Will Allu Arjun Campaign For Pawan Kalyan In Ap Elections
Entertainment

Allu Arjun : జనసేన తరుపున అల్లు అర్జున్ ప్రచారం.. పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు.. పుష్ప 2 షూటింగ్ పూర్తి అవ్వగానే రంగంలోకి?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: August 13, 2023, 11:17 am
Advertisement

Allu Arjun : అవును.. మీరు చదివిన టైటిల్ నిజమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జనసేన పార్టీ తరుపున ప్రచారం చేయబోతున్నారట. అల్లు అర్జున్ కు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇమేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈనేపథ్యంలో అల్లు అర్జున్ తో సినిమాలు తీయడానికి దిగ్గజ దర్శకులు పోటీ పడుతున్నారు. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటిస్తారు అనే దానిపై క్లారిటీ లేదు కానీ.. అల్లు అర్జున్ గురించి ప్రస్తుతం ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీలో చిరంజీవి దగ్గర్నుంచి వైష్ణవ్ తేజ్ వరకు చాలామంది హీరోలు ఉన్నారు. కానీ.. వారిలో ఎవ్వరూ పెద్దగా జనసేన పార్టీకి ఇప్పటి వరకు మద్దతు ఇవ్వలేదు. ఆ పార్టీ గురించి పబ్లిక్ గా మాట్లాడలేదు. ఒక్క నాగబాబు మాత్రమే జనసేనలో చేరి యాక్టివ్ గా రాజకీయాల్లో తిరుగుతున్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నారు. అంతకుమించి మరే మెగా హీరో కూడా జనసేన వైపు చూడలేదు.

will allu arjun campaign for pawan kalyan in ap elections

Advertisement

Allu Arjun : రామ్ చరణ్ ను కాదని అల్లు అర్జున్ ని పవన్ పిలిచారా?

అయితే.. మెగా ఫ్యామిలీలా చాలామంది టాప్ హీరోలు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఉన్నారు. రామ్ చరణ్ కావచ్చు.. అల్లు అర్జున్ కావచ్చు.. సాయి ధరమ్ తేజ్ కావచ్చు వీళ్లంతా మంచి ఇమేజ్ ఉన్న హీరోలే. వీళ్లలో ఎవరు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినా.. ప్రచారం చేసినా అది జనసేనకు ప్లస్సే అవుతుంది. కానీ.. వాళ్లలో ఎవ్వరూ ఇప్పటి వరకు మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలు ఏంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జనసేన పార్టీ తరుపున ప్రచారం చేయబోతున్నారట. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ తరుపున ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ నుంచి అల్లు అర్జున్ కి పిలుపు వచ్చిందట. దీంతో అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పుష్ప 2 షూటింగ్ పూర్తి కాగానే జనసేన ప్రచారంలో అల్లు అర్జున్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి