Guppedantha Manasu : వసుధారను అర్థం చేసుకోని చక్రపాణి.. వెంటనే రాజీవ్ తో వసుధార పెళ్లి.. రిషికి ఈ విషయం తెలిసి ఏం చేస్తాడు?

Authored By Varun G | The Telugu News | Updated on: January 1, 2023, 9:01 am

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. గుప్పెడంత మనసు సీరియల్ 2 జనవరి 2023, సోమవారం ఎపిసోడ్ 649 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధారకు జగతి ఫోన్ చేయడంతో ఫోన్ ఎత్తుతాడు చక్రపాణి. జగతిపై సీరియస్ అవుతాడు. మా అమ్మాయిని ఇప్పటికీ వదలవా అంటూ జగతిపై రెచ్చిపోతాడు చక్రపాణి. వాడెవడో వచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అంటే.. వాడు ఎవడో కాదు.. అతడు మా అబ్బాయి రిషి అని చెబుతుంది జగతి. దీంతో అస్సలు జరగదు. ఈ పెళ్లి అస్సలు జరగదు అంటూ జగతికి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. ఇలా అయితే కష్టం అనుకొని వెంటనే వసుధారను రూమ్ లో బంధించి తాళం వేస్తాడు. వెంటనే రాజీవ్ తో పెళ్లి చేస్తా అంటాడు.

will chakrapani accept vasudhara marriage with rishi

will chakrapani accept vasudhara marriage with rishi

నువ్వు తలుపు తీస్తే.. నేను విషం తాగి చస్తా అని సుమిత్రను బెదిరిస్తాడు. వెంటనే రాజీవ్ కు ఫోన్ చేసి చెబుతాడు. దీంతో మీరు నిశ్చింతగా ఉండండి మామయ్య. నేను ఉన్నాను కదా. మీ పరువు పోతుంటే నేను ఎలా ఊరుకుంటాను మామయ్య గారు. నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తా అని చెబుతాడు రాజీవ్. మరోవైపు జగతి.. చక్రపాణిలో ఫోన్ లో మాట్లాడిన తర్వాత తనకు టెన్షన్ గా ఉంటుంది. వెంటనే మహీంద్రాకు ఈ విషయం చెబుతుంది. మనం వెంటనే వసుధార ఊరికి వెళ్దాం అంటుంది జగతి. కాకపోతే దేవయానికి తెలియకుండా మనం వెళ్లాలని అంటుంది. ఇదంతా దేవయాని వింటుంది.

నేను రాకున్నా నేను చేసే పని అక్కడ చేస్తూనే ఉన్నా అంటూ మనసులో అనుకుంటుంది. వెంటనే రాజీవ్ కు ఫోన్ చేసి మహీంద్రా, జగతి వస్తున్నారని చెబుతుంది. నువ్వు వెంటనే నీ ప్లాన్ ప్రారంభించు అని చెబుతుంది.

మరోవైపు డోర్ తీయి అని సుమిత్రను వేడుకుంటుంది వసుధార. కానీ.. సుమిత్ర మాత్రం నేను తలుపు తీయను అంటుంది. పదే పదే నన్ను అడక్కు. నా వల్ల కాదు వసు అంటుంది. కనీసం ఆ ఫోన్ అయినా ఇవ్వు అంటుంది వసుధార.

Guppedantha Manasu : పూజారిని తీసుకొని ఇంటికి వచ్చిన రాజీవ్

ఒక్కసారి ఫోన్ అయినా ఇవ్వు అంటే.. సుమిత్ర దైర్యం చేసి ఫోన్ ఇవ్వబోతుండగా ఇంతలో అప్పుడే పెళ్లికి కావాల్సిన సామాన్లు తీసుకొని చక్రపాణి అక్కడికి వస్తాడు. ఇవన్నీ సామాన్లు చూసి షాక్ అవుతారు సుమిత్ర, వసుధార.

పెళ్లి సామాగ్రి అని చెబుతాడు. చిన్నమ్మాయి వసుధారకు రాజీవ్ ను ఇచ్చి పెళ్లి చేస్తున్నా అని చెబుతాడు. దీంతో నేను రిషి సార్ నే పెళ్లి చేసుకుంటా అంటుంది వసుధార. కానీ.. చక్రపాణి వినడు. ఇంట్లో పూలు అన్నీ అలంకరిస్తాడు.

ఇంతలో వసుధారకు రిషి ఫోన్ చేస్తాడు. ఏమైంది ఫోన్ తీయట్లేవు.. మీ బావ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అంటాడు. వసుధారకు ఫోన్ ఇవ్వకుండా లౌడ్ స్పీకర్ పెట్టి రిషి మాట్లాడినవన్నీ వింటాడు చక్రపాణి.

నువ్వు నాదానివి. నిన్ను నా నుంచి ఎవ్వరూ విడదీయలేరు అంటాడు రిషి. నేను వస్తున్నా మీ ఇంటికే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో రాజీవ్.. పూజారిని పట్టుకొని వస్తాడు. మామయ్య గారు మీరు ఒక్కరే ఇవన్ని పనులు చేస్తున్నారా అంటాడు. మీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలి అంటాడు రాజీవ్.

పంతులు పెళ్లి అన్నారు. చూస్తే ఎవ్వరూ కనిపించడం లేదు అంటే.. పంతులు గారు అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇంకో గంటలో ముహూర్తం ఉందన్నారు కదా. ఆ ముహూర్తానికి నాకు, ఆ అమ్మాయికి పెళ్లి జరిపించండి అని అంటాడు రాజీవ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp