will clash between ankitha and tulasi come to an end
Intinti Gruhalakshmi 7 Feb Tomorrow Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రారంభం అవుతుంది. 7 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 549 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత తల్లి గాయత్రి.. తులసి ఇంటికి వచ్చి తన కూతురును పనిమనిషిని చేశారని అందరి మీద అరుస్తుంది. అంకితను పనిమనిషిని చేసే హక్కు మీకెవరు ఇచ్చారు. నా కూతురు పని చేయొద్దు. చేయదు కూడా. తను ఈ ఇంటి కోడలు. తను రోజు మొత్తం హాస్పిటల్ లో పని చేసి అలసిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చి కూడా అంకిత పని చేయాలంటే ఎక్కడ కుదురుతుంది.. అని అంటుంది గాయత్రి. దీంతో తాను అంకితను కూతురులాగానే భావించాను కానీ.. ఏనాడూ కోడలుగానూ భావించలేదు అంటుంది తులసి. ఇంతలో అనసూయ అందుకొని.. తులసి లేదని.. ఆకలిగా ఉందని చపాతీలు చేయమన్నాం కానీ.. తనతో రోజు ఎవ్వరూ పని చేయనివ్వడం లేదు అంటుంది తులసి.
will clash between ankitha and tulasi come to an end
ఏదో తప్పయింది.. అంకితను నా కూతురుగానే భావించాను కానీ.. ఇలా అవుతుంది అని నేను అనుకోలేదు. నాదే తప్పు అని చేతులెత్తి మొక్కుతుంది తులసి. అర్థం అయిందా అమ్మా.. నేను మీ అమ్మను అత్తను కాను. జరిగినదంతా మరిచిపో. ఇక నుంచి కేవలం నీ హాస్పిటల్ పని మీదనే ధ్యాస పెట్టు అంటుంది తులసి. దీంతో అంకిత కూడా బాధపడుతుంది. ఇంటి బాధ్యత, వంట బాధ్యత మొత్తం నాది. నువ్వు ఇక నుంచి వంట పని చేయాల్సిన అవసరం లేదు. ఇంటి పని కూడా చేయాల్సిన అవసరం లేదు అని అంకితకు తులసి చెబుతుంది.
అమ్మా.. నువ్వు మొదటి రోజు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ఈరోజు నుంచి అంకితను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి. తనతో ఎవ్వరూ పనులు చేయించుకోకండి అని తులసి ఇంట్లో వాళ్లందరికీ చెబుతుంది.
చూడు అంకిత.. ఒక్క విషయం.. తల్లిలా చెబుతున్నాను గుర్తు పెట్టుకో. ఎప్పుడూ పెద్దవాళ్లకు ఎదురు జవాబు చెప్పకమ్మా అని రిక్వెస్ట్ చేస్తుంది తులసి. ఎప్పటికీ నిన్ను నాలా కానివ్వను… అని ప్రామిస్ చేస్తుంది తులసి. దీంతో అంకితకు ఏం మాట్లాడాలో అర్థం కాదు.
నీ ఉనికిని కోల్పోనివ్వను అని తులసి అంకితకు మాటిస్తుంది. ఆ తర్వాత లాస్య, అంకిత.. ఇద్దరూ బయటికి వెళ్లి డిన్నర్ చేసి వస్తారు. అప్పటికే రాత్రి కావడంతో.. చాలా ఆలస్యం అవడంతో ఇంట్లో వాళ్లు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.
అప్పుడే లాస్య, అంకిత.. ఇద్దరూ ఇంటికి వస్తారు. అందరూ సీరియస్ గా ముఖాలు పెట్టే సరికి అందరూ నన్ను దోషిలా చూస్తున్నారెందుకు. అంకిత మూడ్ బాగోలేదని చెప్పింది. అందుకే డిన్నర్ కు తీసుకెళ్లాను అంటుంది లాస్య. తులసి ఈ ఇంట్లో ఉండగా ఎలాగూ నేను మంచి కోడలు అనిపించుకోలేను. కనీసం మంచి అత్తగానైనా అనిపించుకోనివ్వవా అంటుంది లాస్య.
నీకోసం టెన్షన్ పడుతూ ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయలేదు తెలుసా అని అంకితతో అంటుంది తులసి. పగలూ రాత్రి కష్టపడుతూ కూడా నాకోసం అంటూ ఒక గంట ఖర్చు పెట్టడం తప్పు అయిపోయిందా అని అంటుంది అంకిత. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.