will devayani plan works out on vasudhara
Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 21 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 613 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నన్ను పెద్ద లక్ష్యాలు పెట్టకోవాలని చెప్పిందే జగతి మేడమ్. ఇప్పుడు ఆ మేడమ్ లేకుండా ఇంటర్వ్యూలో ఎలా పాల్గొనాలి అని రిషితో అంటుంది వసుధార. దీంతో జగతి మేడమ్ ఖచ్చితంగా వస్తుంది అంటాడు రిషి. మరోవైపు దేవయాని.. ఎవరికో ఫోన్ చేసి ఏదో కుట్ర చేయడం ధరణి చూస్తుంది. దీంతో ఈ విషయం వెంటనే రిషి, వసుధారకు చెప్పాలని అనుకుంటుంది. కానీ.. రిషి, వసుధార ఇద్దరి ఫోన్లు కలవవు. ధరణి మీద దేవయానికి అనుమానం వస్తుంది. తన మీద అనుమానం రాకుండా కవర్ చేసి.. గౌతమ్ కు ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది ధరణి.
will devayani plan works out on vasudhara
అప్పుడు గౌతమ్.. మహీంద్రా దగ్గరే ఉంటాడు. మీరు కూడా రండి.. అని గౌతమ్.. కోరుతాడు. కానీ.. మహీంద్రా రాను అంటాడు. కానీ.. దేవయాని ఏదో ప్లాన్ చేస్తోందని తెలుసుకున్నాక ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు జగతి మేడమ్ వస్తారా? రారా అనే టెన్షన్ పడుతూ ఉంటుంది వసుధార. ఇంతలో ఆఫీసు బాయ్ జ్యూస్ తీసుకొచ్చి కావాలని వసుధార డ్రెస్ మీద పోస్తాడు. దీంతో తన డ్రెస్ మొత్తం పాడవుతుంది. పర్లేదు సార్ అంటుంది వసుధార. ఇంతలో పుష్ప వస్తుంది. మీడియా వాళ్లు వచ్చారు అని చెబుతుంది. దీంతో వసుధార నువ్వు ఒక పని చేయి.. డ్రెస్ చేంజ్ చేసుకొని రా.. నేను మీడియా వాళ్లను రిసీవ్ చేసుకుంటాను అని చెబుతాడు రిషి.
దీంతో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ కు వెళ్తుంది వసుధార. ఇంతలో జగతి అక్కడికి వస్తుంది. మీరు నిజంగానే వచ్చారా? లేక నేను భ్రమలో ఉన్నానా అని అనుకుంటుంది వసుధార. దీంతో తనను హత్తుకుంటుంది జగతి. నువ్వు సాధించావు అంటుంది జగతి.
కంగ్రాచ్యులేషన్స్ అంటుంది. మీరు నిజంగా వచ్చారు అంటూ వసుధార సంతోషిస్తుంది. వసు.. గెలిచింది నువ్వు కాదు.. నేను గెలిచాను. రిషి గెలిచాడు. డీబీఎస్టీ కాలేజీ గెలిచింది అంటుంది జగతి. ఇంతలో రిషి వస్తాడు. రిషిని చూసి ఎమోషనల్ అవుతుంది జగతి.
మేడమ్.. డాడ్ ఎక్కడ అంటాడు రిషి. డాడ్ రాలేదా అంటాడు. వసుధర మీద ప్రేమతో మీరొచ్చారు మరి నా మీద ప్రేమతో డాడ్ రావాలి కదా అంటాడు. ఖచ్చితంగా తప్పు నాదే అయి ఉంటుంది అంటాడు రిషి. అంత పెద్ద తప్పు నేను ఏం చేశాను మేడమ్.. ఇంతగా నన్ను శిక్షిస్తున్నారు అంటాడు.
డాడ్ కు నామీద అంత కోపం వచ్చిందంటే నేను ఏదో పెద్ద పాపమే చేసి ఉంటాను అంటాడు రిషి. నా తప్పేంటో ఎందుకు రాలేదో మీకైనా తెలుసా మేడమ్ అంటాడు రిషి. సర్లేండి మీకు చెప్పాలనిపించకపోతే చెప్పకండి అంటాడు రిషి. మీరైనా వచ్చినందుకు చాలా థాంక్స్ మేడమ్ అంటాడు రిషి.
తర్వాత డ్రెస్ మార్చుకునేందుకు వసుధార అక్కడే ఉండగా.. జగతి, రిషి బయటికి వెళ్లిపోతారు. ఇంతలో ఆ ఆఫీస్ బాయ్ వచ్చి వసుధార ఉన్న రూమ్ డోర్ లాక్ చేసి వెళ్తాడు. ఇంటర్వ్యూకు టైమ్ అవుతున్నా ఇంకా వసుధార రావడం లేదేంటని టెన్షన్ పడతాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.