Samantha: కరోనా ప్యాండమిక్ సమయంలో సమంత చేసిన పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. ప్రత్యేకంగా భారీ సెట్స్ నిర్మించి త్వరగానే టాకీ పార్ట్ కంప్లీట్ చేశారు. దాంతో సమంత నుంచి భారీ పాన్ ఇండియన్ సినిమా వస్తుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా సమంత కొత్త ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. చెప్పాలంటే ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో సమంత చేతిలో ఉన్నన్ని ప్రాజెక్ట్ మరే హీరోయిన్ చేతిలో లేవు. ఆమె ఒప్పుకున్న సినిమాలన్ని బ్లాక్ బస్టర్ అవుతాయా లేదా అనేది ఆ దేవుడికే తెలియాలి.కానీ, సినిమా కంప్లీట్ కాకముందే మరో సినిమాకు సైన్ చేస్తూ షాకిస్తోంది.
ఈ నెల 28న భారీ పోటీ మధ్య సమంత నటించిన తమిళ మల్టీస్టారర్ సినిమా కతు వాక్కుల రెండు కాదల్ రిలీజ్ అవుతోంది. తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా పేరుతో రిలీజ్ అవుతోంది. ఆచార్య లాంటి మెగా మల్టీస్టారర్ మధ్య సమంత డబ్బింగ్ సినిమాను పట్టించుకుంటారా అంటే అనుమానమే. దీనికి కారణం థియేట్రికల్ ట్రైలర్ వచ్చాక ఇలాంటి సినిమాలు అన్ని భాషలలో కుప్పలు కుప్పలుగా వచ్చి అడ్రస్ లేకుండా పోయాయి. ఎంత స్టార్ కాస్టింగ్ ఉంటే మాత్రం ఇలాంటి పరమ రొటీన్ సినిమాను చూడాలా..అనే కామెంట్స్ ఇప్పటికే వినిపిస్తున్నాయి.ఇక సమంత అంత ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తుందో లేదో గానీ, ఆమె అభిమానులు మాత్రం శాకుంతలం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
పౌరాణిక గాధ ఆధారంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వీఎఫెక్స్ వర్క్ జరుగుతోంది. అయితే, ఇండస్ట్రీలో శాకుంతలం అనే ఓ సినిమా తయారవుతుందనే విషయం చాలామందికి గుర్తే లేదు. అసలు ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క అప్‌డేట్ హైప్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి. చెప్పాలంటే నాగ చైతన్యతో విడాకులు ప్రకటించాక ఏకంగా ఈ సినిమాతోనే వచ్చి హాట్ టాపిక్ అవుతుందని భావించారు. మరి గుణశేఖర్ ఎందుకు ఈ సినిమా విషయంలో బజ్ క్రియేట్ చేయడంలేదో అంటున్నారు. సమంతకు ఇది చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. ఫైనల్ రిజల్ట్‌తో డిసప్పాయింట్ చేస్తాడేమో అని ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
This website uses cookies.