Samantha : సమంతను ఆయన నిరాశపరుస్తాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంతను ఆయన నిరాశపరుస్తాడా..?

 Authored By govind | The Telugu News | Updated on :26 April 2022,9:00 pm

Samantha: కరోనా ప్యాండమిక్ సమయంలో సమంత చేసిన పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం. ప్రత్యేకంగా భారీ సెట్స్ నిర్మించి త్వరగానే టాకీ పార్ట్ కంప్లీట్ చేశారు. దాంతో సమంత నుంచి భారీ పాన్ ఇండియన్ సినిమా వస్తుందని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా సమంత కొత్త ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. చెప్పాలంటే ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో సమంత చేతిలో ఉన్నన్ని ప్రాజెక్ట్ మరే హీరోయిన్ చేతిలో లేవు. ఆమె ఒప్పుకున్న సినిమాలన్ని బ్లాక్ బస్టర్ అవుతాయా లేదా అనేది ఆ దేవుడికే తెలియాలి.కానీ, సినిమా కంప్లీట్ కాకముందే మరో సినిమాకు సైన్ చేస్తూ షాకిస్తోంది.

ఈ నెల 28న భారీ పోటీ మధ్య సమంత నటించిన తమిళ మల్టీస్టారర్ సినిమా కతు వాక్కుల రెండు కాదల్ రిలీజ్ అవుతోంది. తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా పేరుతో రిలీజ్ అవుతోంది. ఆచార్య లాంటి మెగా మల్టీస్టారర్ మధ్య సమంత డబ్బింగ్ సినిమాను పట్టించుకుంటారా అంటే అనుమానమే. దీనికి కారణం థియేట్రికల్ ట్రైలర్ వచ్చాక ఇలాంటి సినిమాలు అన్ని భాషలలో కుప్పలు కుప్పలుగా వచ్చి అడ్రస్ లేకుండా పోయాయి. ఎంత స్టార్ కాస్టింగ్ ఉంటే మాత్రం ఇలాంటి పరమ రొటీన్ సినిమాను చూడాలా..అనే కామెంట్స్ ఇప్పటికే వినిపిస్తున్నాయి.ఇక సమంత అంత ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తుందో లేదో గానీ, ఆమె అభిమానులు మాత్రం శాకుంతలం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

will gunashekar dissaapoints Samantha

will gunashekar dissaapoints Samantha

Samantha: ఫైనల్ రిజల్ట్‌తో డిసప్పాయింట్ చేస్తాడేమో..?

పౌరాణిక గాధ ఆధారంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వీఎఫెక్స్ వర్క్ జరుగుతోంది. అయితే, ఇండస్ట్రీలో శాకుంతలం అనే ఓ సినిమా తయారవుతుందనే విషయం చాలామందికి గుర్తే లేదు. అసలు ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క అప్‌డేట్ హైప్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి. చెప్పాలంటే నాగ చైతన్యతో విడాకులు ప్రకటించాక ఏకంగా ఈ సినిమాతోనే వచ్చి హాట్ టాపిక్ అవుతుందని భావించారు. మరి గుణశేఖర్ ఎందుకు ఈ సినిమా విషయంలో బజ్ క్రియేట్ చేయడంలేదో అంటున్నారు. సమంతకు ఇది చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. ఫైనల్ రిజల్ట్‌తో డిసప్పాయింట్ చేస్తాడేమో అని ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది