Janaki Kalaganaledu 7 Feb Episode Highlights : వెన్నెల పెళ్లి సంబంధం సెట్.. దీంతో దిలీప్ ను మరిచిపోలేక వెన్నెల ఏం చేస్తుంది? జానకి మీద అలిగిన రామా.. ఇంతలో మరో ట్విస్ట్

Janaki Kalaganaledu 7 Feb Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం, 7 ఫిబ్రవరి 2022 నాడు ప్రసారం అవుతుంది. 7 ఫిబ్రవరి 2022 సోమవారం ఎపిసోడ్ 231 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ‌.. కులదేవతకు మొక్కు చెల్లించాలని జానకి, రామా ఇద్దరినీ వెళ్లమని చెప్పిన విషయం తెలిసిందే. కుల దేవత కోసం నేను ప్రసారం తయారు చేస్తాను. మీరు వెళ్లి త్వరగా రెడీ అవ్వండి అని చెబుతుంది జ్ఞానాంబ‌. దీంతో సరే అత్తయ్య గారు అంటుంది జానకి. మరోవైపు మల్లికకు.. రామా, జానకి ఇద్దరూ వెళ్లడం నచ్చదు. మేము కూడా వెళ్తాం అని మల్లిక అంటుంది. దీంతో గోవిందరాజు తనపై పంచ్ లు వేస్తాడు. మీరు మరోసారి వెళ్దురులే అంటుంది జ్ఞానాంబ‌.

will janaki obey jnanamba instructions over her ips study

జానకి గుడికి వెళ్తే.. నేను హనీమూన్ కు వెళ్తాను అంటుంది జానకి. దీంతో అమ్మ ఎలా ఒప్పుకుంటుంది అంటాడు. అది తెలియాలంటే మీరు ముందు మీ అమ్మ దగ్గరికి వెళ్లండి అంటుంది మల్లిక. కుల దేవత కోసం జ్ఞానాంబ‌ ప్రసాదం వండుతూ ఉంటుంది. ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. ఎవరు అంటే.. నేను వెంకాయమ్మను మాట్లాడుతున్నాను. మల్లిక వాళ్ల నానమ్మకు అస్సలు బాలేదండి. తను ఇప్పుడో రేపో అన్నట్టుగా ఉంది. మల్లికమ్మను చూడాలంటున్నారండి. వెంటనే తనను పంపించండి అని చెబుతుంది. అయితే అదంతా మల్లిక ఆడిన నాటకం అని తెలియక జ్ఞానాంబ‌.. మల్లికను వెంటనే అక్కడికి వెళ్లమని చెబుతుంది. విష్ణును తీసుకెళ్లాలని చెబుతుంది జ్ఞానాంబ‌.

మరోవైపు జానకి తన బట్టలు సర్దుతూ ఉంటుంది. రామా వచ్చి తన బట్టలను వేరే బ్యాగ్ లో సర్దుకుంటాడు. జానకి అడిగినా కూడా సమాధానం చెప్పడు. దీంతో మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటుంది జానకి. మనిద్దరి బట్టలు ఒకే బ్యాగులో సరిపోతాయి కదా.. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటుంది. నేను ఐపీఎస్ చదవాలన్న కలను వదిలేసుకున్నాను అని చెప్పినా మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటుంది జానకి.

ఇంతలో జ్ఞానాంబ‌ వస్తుంది. కులదేవతకు సమర్పించాల్సిన ప్రసాదాన్ని జానకికి ఇచ్చి.. పూజ తర్వాత ఖచ్చితంగా ఈ నైవేద్యాన్ని సమర్పించాలి. ఇది కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ ప్రసాదాన్ని సమర్పించే సమయంలో చాలా నియమ నిష్టలతో ఉండాలి అని జానకికి చెబుతుంది జ్ఞానాంబ‌.

మరోవైపు మల్లిక నానమ్మ బాగానే ఉంటుంది. తనకు ఏం కాదు. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆటోలో ఇంటికి వెళ్తుంది. రామా, జానకి ఇద్దరూ కారులో కులదేవత గుడికి బయలుదేరుతారు. రామా మాత్రం జానకితో ఏం మాట్లాడడు.

Janaki Kalaganaledu 7 Feb Episode Highlights : కుల దేవతను దర్శించుకోవడానికి వెళ్లిన రామా, జానకి

మీ ఫేస్ కు ఆ సీరియస్ నెస్ అస్సలు సెట్ అవ్వదు. మీరు నవ్వితేనే బాగుంటారు. చాలా చాలా అందంగా ఉంటారు అంటుంది జానకి. గుడికి వెళ్తున్నాం అని తెలుసు కదా. మళ్లీ ఎక్కడికి వెళ్తున్నాం అని మొదలు పెట్టింది ఎవరు అని అంటాడు రామా.

మీ కోపానికి కారణం నాకు అర్థం అయింది కానీ.. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అదే నా బాధ అంటుంది జానకి. దీంతో కారులో పాటలు పెట్టుకొని వింటూ ఉంటాడు రామా. దాన్ని బంద్ చేసి మీకు నేను ఇచ్చిన మాట ప్రకారం.. నేను ఐపీఎస్ చదవలేను. అది నాకు తలకు మించిన భారం అంటుంది జానకి.

ఇప్పుడు నాకు చదువు అనే బాధ్యత కంటే కోడలు అనే బాధ్యతే ఎక్కువ. చాలా ముఖ్యం కూడా అంటుంది జానకి. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ప్రస్తుతం నేను కోడలుగా నా ధర్మాన్ని నిర్వర్తించాలి.. ఆ తర్వాతే సమాజం, ప్రజలు అంటుంది.

జానకి ఏది చెబుతున్నా.. పాటలు పెట్టుకొని వింటూ ఉంటాడు రామా. నాకు నా కుటుంబం ముఖ్యం. ఆ తర్వాతే ఏదైనా. దయచేసి అర్థం చేసుకోండి అంటుంది జానకి. మరోవైపు జ్ఞానాంబ‌కు ఫోన్ వస్తుంది. దాన్ని వెన్నెల తీసుకొచ్చి ఇస్తుంది.

జ్ఞానాంబ‌ గారు నమస్కారం అండి.. నేనండి సుబ్బరాజును. రామచంద్రాపురం నుంచి అని చెబుతాడు. మమ్మల్ని క్షమించడి. బంగారం లాంటి మీ సంబంధాన్ని మేము వద్దనుకున్నాం. ఇప్పుడు పశ్చాతాప పడుతున్నాం. దయచేసి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని వేడుకుంటాడు.

మా వాళ్లతో ఒకసారి మాట్లాడి నా నిర్ణయం చెబుతాను అని చెబుతుంది జ్ఞానాంబ‌. మా పెద్దబ్బాయి, కోడలు పూజ చేయడానికి ఊరెళ్లారు. వాళ్లు వచ్చాక చెబుతాం అనగానే.. సరేనమ్మ మీ ఫోన్ కోసం ఎదురుచూస్తుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

దీంతో వెన్నెల.. రామచంద్రాపురం వాళ్లు ఫోన్ చేశారు. ఎల్లుండి నిశ్చితార్థం అంటున్నారని వెళ్లి మీ నాన్నకు చెప్పు అంటుంది జ్ఞానాంబ‌. దీంతో వెన్నెల షాక్ అవుతుంది. కట్ చేస్తే దారి మధ్యలో కారును ఆపుతాడు రామా. కాఫీ కావాలని జానకి అంటుంది. నా దగ్గర డబ్బులు లేవు అంటాడు.

దీంతో తన దగ్గర ఉన్న ఉంగురాన్ని ఇచ్చి నాకు కాఫీ ఇవ్వు బాబు అంటుంది జానకి. దీంతో 20 రూపాయల కాఫీ కోసం ఏకంగా ఉంగరం ఇచ్చేస్తావా అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago