Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 2 మే 2022, సోమవారం ఎపిసోడ్ 291 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యోగి కొడుకు బారసాల ఫంక్షన్ కాసేపట్లో ప్రారంభం కానున్నా ఇంకా జ్ఞానాంబ వాళ్లు రారు. దీంతో ఇంటి ముందు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఊర్మిళ. జానకి ఫ్రెండ్ శ్రావణి కూడా వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో యోగి వచ్చి ఏమైంది ఇక్కడ నిలుచనున్నావు. కాసేపట్లో బారసాల ఫంక్షన్ ఉంది.. పదా పనులు చూసుకుందాం అంటాడు యోగి. కానీ.. ఊర్మిళ మాత్రం.. జ్ఞానాంబ కుటుంబం వస్తేనే ఈ బారసాల ఫంక్షన్ జరుగుతుందని చెబుతుంది. దీంతో యోగికి ఏం మాట్లాడాలో అర్థం కాదు.
వాళ్లు ఎలా వస్తారు.. వాళ్లు కనీసం జానకిని కూడా పంపించరు అంటాడు. వాళ్ల కోసం బారసాల ఫంక్షన్ ను ఆపడం ఏంటి అంటాడు. కానీ.. వాళ్లను తీసుకొచ్చేందుకు జానకి ఫ్రెండ్ రుక్మిణి.. బాబును తీసుకొని జ్ఞానాంబ ఇంటికి వెళ్లిందని చెబుతుంది శ్రావణి. దీంతో యోగికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మరోవైపు జానకి తన రూమ్ లో బాధపడుతూ కూర్చొంటుంది. జానకి బాధపడుతూ కూర్చోవడం చూసి మల్లికకు చాలా సంతోషం వేస్తుంది.
ఇంతలో రుక్మిణి.. జ్ఞానాంబ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. తనను చూసి ఎవరు అని అడుగుతుంది మల్లిక. నా పేరు రుక్మిణి అని అడుగుతుంది. దీంతో ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. జ్ఞానాంబ గారెతో మాట్లాడటానికి వచ్చా అంటుంది. దీంతో ఆవిడతో తర్వాత ముందు నాతో మాట్లాడు అంటుంది మల్లిక. దీంతో అసలు ఎవరు నువ్వు.. అంటూ మల్లికపై సీరియస్ అవుతుంది.
ఇంతలో జ్ఞానాంబ, గోవింద రాజు వస్తారు. వాళ్లకు నమస్కారం పెట్టి.. నా పేరు రుక్మిణి అంటుంది. లోపలికి రా అంటుంది జ్ఞానాంబ. ఇంతలో అందరూ వస్తారు. జానకి, రామా కూడా వస్తారు. నేను జానకి దోస్తును అంటుంది రుక్మిణి. రుక్మిణి అంటూ జానకి తెగ సంతోషిస్తుంది.
జానకిని చూసి.. బాబును తీసుకెళ్లి జానకికి ఇస్తుంది రుక్మిణి. బాబును ఎత్తుకొని మురిసిపోతుంది జానకి. ఆ తర్వాత జ్ఞానాంబతో మాట్లాడుతుంది. మీరు రాకపోతే ఆ ఫంక్షన్ జరగదు అంటుంది. ఊళ్లో ఏ ఫంక్షన్ జరిగినా వెళ్లే మీరు.. కోడలు పుట్టింట్లో జరిగే ఫంక్షన్ కు రాకపోవడం ఏంటని అడుగుతుంది.
మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. జానకిని తీసుకెళ్లండి కానీ.. మేము రాము అంటాడు రామా. బిడ్డ గురించి ఒక తల్లి పడే తపన ఇక్కడ మీకు మాత్రమే సమజ్ అవుతది.. అని రుక్మిణి జ్ఞానాంబతో అంటుంది. ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతోంది.. అంటుంది రుక్మిణి.
మీ రెండు కుటుంబాల మధ్య ఉన్న కోపతాపాలు.. ఈ పసివాడికి శాపంగా మారడం ఎందుకు అంటుంది రుక్మిణి. మీ కోడలు చేసిన తప్పు అంత క్షమించరానిదా.. ఈ అమ్మకు కూతురును క్షమించడం పెద్ద కష్టమా అంటుంది రుక్మిణి. అమ్మా రుక్మిణి.. నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ.. చాలా బాగా చెప్పావమ్మా అంటాడు గోవిందరాజు.
కట్ చేస్తే.. ఊర్మిళ కొడుకు బారసాల ఫంక్షన్ కు జ్ఞానాంబ కుటుంబం వెళ్తుంది. అక్కడ.. మనకు అమ్మ అయినా.. అత్తమ్మ అయినా అన్నీ మనకు అత్తయ్య గారే అంటుంది జానకి. అత్తయ్య గారు మీ చల్లని చేతులతో బాబును ఊయలలో వేయండి అని అడుగుతుంది జానకి.
అదే బాబుకు కొండంత శ్రీరామరక్ష అంటుంది. దీంతో బాబును ఎత్తుకుంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు.…
RBI : ఆర్ధిక అవసరాల దృష్ట్యా చూస్తే చాలామంది తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను ఉంచడంలో విఫలమవుతున్నారు.…
Coconut Oil : కొబ్బరి చెట్టును కల్ప వృక్షం అని అంటారు. ఎందుకు అంటే ఈ చెట్టు నుండి దొరికే అన్ని…
Airport Jobs : ఏ.ఐ ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (ఏ.ఐ.ఏ.ఎస్.ఎల్) అనే సంస్థ ఎయిర్ పోర్ట్ సర్వీసుల కోసం…
This website uses cookies.