Salaar : కేజీఎఫ్ 2 సక్సెస్ ప్రభాస్‌కు షాకిస్తుందా..? అంటే అలాంటి పరిస్థితులు గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా రిలీజ్ సమయానికి ఏర్పడవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఓ సినిమా హిట్ అయితే..ఆ తర్వాత అదే దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాపై అన్ని రకాలుగా ప్రభావం చూపుతుంది. ఇలాంటి సందర్భాలు ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చూసి ఉన్నాము. ఒకరకంగా ప్రభాస్‌కు బ్యాక్ టు బ్యాక్ షాకులు తగలడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ప్రభాస్‌ను రాజమౌళి బాహుబలి సిరీస్ చిత్రాలతో ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు.దాంతో ఆ తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయాలనుకుంటున్న దర్శకులకు బాధ్యత భారీ స్థాయిలో ఉంటోంది.
ఏ హీరో విషయంలో అయినా ఓ సినిమా హిట్ ఐతే తర్వాత సినిమా దానికి రెట్టింపు ఉంటుందని అభిమానులతో పాటు అందరూ ఫిక్సైపోతారు. కానీ, దానివల్ల మన హీరోలు – దర్శకులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఏం చేసినా అభిమానులను, ప్రేక్షకులను మెప్పించడానికే చేస్తారు. కానీ, అవి ఎప్పుడూ వర్కౌట్ అవడం అంటే కత్తి మీద సాము చేసినట్టు అవుతోంది.ఇటీవల కన్నడ స్టార్ హీరో యష్ – సెన్షేషాల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన ప్రాజెక్ట్ కేజీఎఫ్ 2 సంచలన విజయాన్ని అందుకుంది.
బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 వసూళ్ళు రాబట్టింది. ఇంకా చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ కంటే కూడా కేజీఎఫ్ 2 సినిమాకే ప్రశంసలు ఎక్కువగా దక్కాయి. దాంతో ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న సలార్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలై సంవత్సరం దాటిపోయింది. అయినా 30 శాతమే షూటింగ్ అయింది. మరి ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలీదు గానీ, సలార్ గ్యారెంటీగా కేజీఎఫ్ 2ని మించి ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా షాక్ తగిలేది మాత్రం ప్రభాస్‌కే అని సందేహం లేకుండా చెప్పొచ్చు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.