Prabhas : కేజీఎఫ్ 2 సక్సెస్ ప్రభాస్‌కు షాకిస్తుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : కేజీఎఫ్ 2 సక్సెస్ ప్రభాస్‌కు షాకిస్తుందా..?

 Authored By govind | The Telugu News | Updated on :17 May 2022,2:30 pm

Salaar : కేజీఎఫ్ 2 సక్సెస్ ప్రభాస్‌కు షాకిస్తుందా..? అంటే అలాంటి పరిస్థితులు గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా రిలీజ్ సమయానికి ఏర్పడవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఓ సినిమా హిట్ అయితే..ఆ తర్వాత అదే దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాపై అన్ని రకాలుగా ప్రభావం చూపుతుంది. ఇలాంటి సందర్భాలు ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చూసి ఉన్నాము. ఒకరకంగా ప్రభాస్‌కు బ్యాక్ టు బ్యాక్ షాకులు తగలడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ప్రభాస్‌ను రాజమౌళి బాహుబలి సిరీస్ చిత్రాలతో ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు.దాంతో ఆ తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయాలనుకుంటున్న దర్శకులకు బాధ్యత భారీ స్థాయిలో ఉంటోంది.

ఏ హీరో విషయంలో అయినా ఓ సినిమా హిట్ ఐతే తర్వాత సినిమా దానికి రెట్టింపు ఉంటుందని అభిమానులతో పాటు అందరూ ఫిక్సైపోతారు. కానీ, దానివల్ల మన హీరోలు – దర్శకులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఏం చేసినా అభిమానులను, ప్రేక్షకులను మెప్పించడానికే చేస్తారు. కానీ, అవి ఎప్పుడూ వర్కౌట్ అవడం అంటే కత్తి మీద సాము చేసినట్టు అవుతోంది.ఇటీవల కన్నడ స్టార్ హీరో యష్ – సెన్షేషాల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన ప్రాజెక్ట్ కేజీఎఫ్ 2 సంచలన విజయాన్ని అందుకుంది.

Will KGF2 Success Salaar Shock Prabhas

Will KGF2 Success Salaar Shock Prabhas

Prabhas : ఏమాత్రం తేడా కొట్టినా షాక్ తగిలేది మాత్రం ప్రభాస్‌కే..?

బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 వసూళ్ళు రాబట్టింది. ఇంకా చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ కంటే కూడా కేజీఎఫ్ 2 సినిమాకే ప్రశంసలు ఎక్కువగా దక్కాయి. దాంతో ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న సలార్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలై సంవత్సరం దాటిపోయింది. అయినా 30 శాతమే షూటింగ్ అయింది. మరి ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలీదు గానీ, సలార్ గ్యారెంటీగా కేజీఎఫ్ 2ని మించి ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా షాక్ తగిలేది మాత్రం ప్రభాస్‌కే అని సందేహం లేకుండా చెప్పొచ్చు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది