Dimple Hayati : ఎంత చూపించినా ఏం లాభం ఖిలాడి భామ ఖేల్ ఖతమేగా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dimple Hayati : ఎంత చూపించినా ఏం లాభం ఖిలాడి భామ ఖేల్ ఖతమేగా..?

Dimple Hayati : ఎంత చూపించినా ఏం లాభం ‘ఖిలాడి’ భామ ఖేల్ ఖతమేగా ..? అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం హీరోయిన్ డింపుల్ హయాతీ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. గద్దలకొండ గణేశ్ సినిమాలో సూపర్ హిట్టూ నీ హైటూ అంటూ అందాలు ఆరబోసి ఆకట్టుకున్న డింపుల్ హయాతీ…ఐటెంస్ సాంగ్స్‌కు బాగానే పనికొస్తుందని పేరు తెచ్చుకుంది. కానీ, అనూహ్యంగా అమ్మడికి హీరోయిన్‌గా అవకాశాలు దక్కాయి. కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన […]

 Authored By govind | The Telugu News | Updated on :24 April 2022,6:30 pm

Dimple Hayati : ఎంత చూపించినా ఏం లాభం ‘ఖిలాడి’ భామ ఖేల్ ఖతమేగా ..? అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం హీరోయిన్ డింపుల్ హయాతీ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. గద్దలకొండ గణేశ్ సినిమాలో సూపర్ హిట్టూ నీ హైటూ అంటూ అందాలు ఆరబోసి ఆకట్టుకున్న డింపుల్ హయాతీ…ఐటెంస్ సాంగ్స్‌కు బాగానే పనికొస్తుందని పేరు తెచ్చుకుంది. కానీ, అనూహ్యంగా అమ్మడికి హీరోయిన్‌గా అవకాశాలు దక్కాయి. కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాతో పాటు తమిళ హీరో విశాల్ నటించిన సామాన్యుడు సినిమాలో కూడా ఛాన్స్ దక్కింది.

కానీ, విశాల్ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో డింపుల్ హయాతి ఆశలన్నీ రవితేజ నటించిన ఖిలాడి సినిమా మీదే పెట్టుకుంది. క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రవితేజ వరుసగా భారీ సినిమాలను లైన్‌లో పెట్టాడు. దాంతో ఖిలాడి సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగాయి. డ్యూయల్ రోల్‌లో మాస్ మహారాజ నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ కూడా మరో హీరోయిన్‌గా నటించింది. ముందు నుంచి ఖిలాడి సినిమా మీద అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి.

will makers give chance to dimple hayati again

will makers give chance to dimple hayati again

Dimple Hayati : మాస్ అపీల్ ఉండే డింపుల్ ..

కానీ, ఎందుకనో మాస్ మహారాజాకు ఖిలాడి హిట్ ఇవ్వలేకపోయింది. కనీసం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనే టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది. వాస్తవంగా మాస్ మహారాజాకు మాస్ అపీల్ ఉండే డింపుల్ పర్ఫెక్ట్ జోడీ అనుకున్నారు. ఈ సినిమా లో డింపుల్ తన ఎద అందాలను ఎంత చూపించాలో అంతా చూపించింది. బ్యూటీకి కలర్ కాస్త తక్కువైనా కూడా మాస్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. కానీ, ఖిలాడి ఫ్లాప్ అమ్మడికి భారీ షాకిచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు ఫ్లాపయి డింపుల్ కెరీర్‌ను డైలమాలో పడేశాయి. ప్రస్తుతానికైతే అమ్మడి కెరీర్ కాస్త అయోమయంగానే ఉంది. మరి మన మేకర్స్ ఈ టాలెంటెడ్ హీరోయిన్‌ను పట్టించుకుంటే సక్సెస్ అందుకొని ఫేం తెచ్చుకుంటుందేమో చూడాలి.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది