Janaki Kalaganaledu : జానకికి తృటితో తప్పిన పెను ప్రమాదం.. రామా కాపాడకబోయి ఉంటే జానకికి ఏ జరిగేది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : జానకికి తృటితో తప్పిన పెను ప్రమాదం.. రామా కాపాడకబోయి ఉంటే జానకికి ఏ జరిగేది?

 Authored By gatla | The Telugu News | Updated on :10 July 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలనగలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సోమవారం, 11 జులై 2022, ఎపిసోడ్ 341 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి ఎంత ట్రై చేసినా.. సంసారం చేద్దామన్నా రామా మాత్రం అస్సలు వినడు. వద్దంటే వద్దు అంటాడు. తన ఐపీఎస్ చదువు పూర్తయ్యాకనే ఫస్ట్ నైట్ అంటాడు. జానకి ఎంత టెంప్ట్ చేసినా కూడా అవ్వడు. తనకు ముద్దు ఇవ్వబోయిన జానకిని అడ్డుకుంటాడు. చివరకు ఫస్ట్ నైట్ ను మరో రెండేళ్లకు పొడిగిస్తారు రామా, జానకి. మరోవైపు జానకి కంటే ముందు తనే పిల్లలను కని ఆ 5 సెంట్ల భూమిని తానే కొట్టేయాలని అనుకుంటుంది జానకి. దాని కోసం తన భర్తతో సరసాలు ఆడేందుకు ట్రై చేసి కాలు జారి కింద పడిపోతుంది.

will mallika plan work out in janaki kalaganaledu

will mallika plan work out in janaki kalaganaledu

మరోవైపు తెల్లవారగానే అందరినీ పిలిచి మాట్లాడుతుంది జ్ఞానాంబ. ఈరోజు ఏరువాక పౌర్ణమి అని చెప్పి అందరినీ పొలం దగ్గరికి వెళ్లి పూజ చేయాలి రెడీ అవ్వాలని అడుగుతుంది. దీంతో అందరూ రెడీ అవుతారు. ఏరువాక పండుగ కోసం పొలానికి బయలుదేరుతారు. రామా, జానకి ఇద్దరూ బండి మీద పొలానికి వెళ్తారు. అక్కడ పూజలు నిర్వహించాక.. మగవాళ్లు పలుగు, పారా పట్టుకొని భూమిని తవ్వుతూ వెళ్లాలని చెబుతుంది జ్ఞానాంబ. ఆడవాళ్లు విత్తనాలను వేసుకుంటూ వెళ్లాలని చెబుతుంది. అయితే.. విత్తనాలు వేస్తున్నప్పుడు మధ్యలో ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు రాకూడదని.. ఒకవేళ విత్తనాలు వేస్తుంటే మధ్యలో ఏవైనా ఆటంకాలు వస్తే.. పంట చేతికి వచ్చే సమయం వరకు ఇలాగే ఆటంకాలు వస్తుంటాయని చెబుతుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu : మల్లిక వక్ర బుద్ధి

అయితే.. మల్లిక అక్కడ కూడా తన వక్రబుద్ధిని చూపించుకుంటుంది. జానకిని ఎలాగైనా జ్ఞానాంబతో తిట్టించాలని ప్లాన్ వేస్తుంది. రామా, విష్ణు ఇద్దరూ పలుగు, పార పట్టుకొని భూమిని తవ్వుతూ వెళ్తుండగా.. జానకి, మల్లిక, జ్ఞానాంబ ముగ్గురు విత్తనాలు చల్లుతూ వెళ్తుంటారు.

ఇంతలో కొంత దూరం వెళ్లాక జానకి కాలుకు అడ్డం పెడుతుంది మల్లిక. దీంతో జానకి కింద పడబోతుంది. ముందుకు వెళ్లి గడ్డపార మీద పడబోతుంది. ఇంతలో రామా వచ్చి తనను కాపాడాతాడు. దీంతో తృటిలో జానకి ప్రాణాలతో బయటపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది