
will rama and janaki get caught by mallika after coming from coaching
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 7 మార్చి 2022 ఎపిసోడ్ 250 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి, రామా ఇద్దరూ కలిసి రాజమండ్రికి ఐపీఎస్ క్లాస్ కు వెళ్తుంటారు. ఇంతలో వర్షం వస్తుంది. దీంతో ఓ చెట్టు కింద ఆగుతారు ఇద్దరు. అంతలోనే ఇద్దరి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. రామా తనకు కిస్ ఇవ్వబోతాడు. అంతలోనే వర్షం తగ్గుతుంది. దీంతో ఇద్దరూ ఐపీఎస్ క్లాస్ కు వెళ్తారు. మరోవైపు జానకి, రామా ఎప్పుడు వస్తారా.. ఎప్పుడు వాళ్లను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది మల్లిక. ఎక్కడి నుంచి గోడ దూకి వెళ్లారో.. అక్కడి నుంచే గోడ దూకి వస్తారు కాబట్టి.. వాళ్లు రాగానే అడ్డంగా పట్టేసుకుంటాను అనుకుంటుంది.
will rama and janaki get caught by mallika after coming from coaching
కానీ.. ఫుల్లుగా దోమలు ఉండటం వల్ల తనకు ఏం చేయాలో అర్థం కాదు. అలాగే తనకు నిద్ర కూడా వస్తుంది. దీంతో అక్కడే నిద్రపోతుంది. మరోవైపు రామా, జానకి గోడ దూకి అక్కడ పడుకొని ఉన్న మల్లికను చూస్తారు. దీంతో షాక్ అవుతారు. తను లేవకముందే అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఉదయం చికిత ఊడుస్తూ అక్కడ పడుకొని ఉన్న మల్లికను చూసి షాక్ అవుతుంది. మరోవైపు ఉదయమే జ్ఞానాంబ, గోవిందరాజు డోర్ ను బాదుతారు కుటుంబ సభ్యులు. ఏమైందో అని జ్ఞానాంబ, గోవిందరాజు అనుకుంటారు. ఎవరు ఇంత పొద్దున్నే డోర్ కొట్టేంది. ఇంత పొద్దున్నే ఏం జరిగి ఉంటుంది అని అనుకొని జ్ఞానాంబ వెళ్లి డోర్ తీస్తుంది.
డోర్ తీసి షాక్ అవుతుంది. హ్యాపీ 25 యానివర్సరీ అని దానికి సంబంధించిన బెలూన్స్ ను పట్టుకొని నిలబడతారు. ఏంట్రా ఇదంతా అంటే పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటారు. వాళ్లిద్దరిని పిలిచి.. వాళ్లతో పాటు నిలబెట్టుకొని సంబురాలు చేస్తారు అందరూ. దీంతో జ్ఞానాంబ, గోవిందరాజు చాలా సంతోషిస్తారు.
ఒరేయ్ రాముడు.. ఇన్నాళ్లలో ఎప్పుడూ లేనిది కొత్తగా ఏంట్రా ఇదంతా అని అడుగుతాడు రామా. దీంతో ఇదంతా జానకి ఆలోచన అని చెబుతాడు రామా. ఎంతైనా వదిన చదువుకుంది కదా.. ఇలాంటి విషయాలు జానకి వదినకు కరెక్ట్ గా తెలుసు అంటారు అఖిల్, వెన్నెల.
దీంతో అవును అంటాడు గోవిందరాజు. అందరూ జానకిని మెచ్చుకునేసరికి.. మల్లికకు కోపం వస్తుంది. అత్తయ్య గారు మామూలుగా అయితే ఈ ఏర్పాట్లన్నీ నేనే చేద్దామనుకున్నాను.. కానీ మీకు ఇవన్నీ ఇష్టం ఉండవని ఇవన్నీ చేయలేదు అంటుంది మల్లిక.
దీంతో అందరూ తెగ నవ్వేస్తారు. అందరూ నన్నే అంటారు. అసలే అత్తయ్య గారికి పెద్ద కోడలు అంటే ఇష్టం. నేనంటే చాలా కోపం.. అంటుంది మల్లిక. దీంతో అదేం లేదు.. నాకు ఇద్దరు కోడళ్లు ఒక్కటే అంటుంది జ్ఞానాంబ. అది సరే కానీ.. నాన్నా నువ్వు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబితేనే ఇంత సిగ్గుపడుతున్నావంటే.. ఇక పెళ్లి చూపులప్పుడు ఎంత సిగ్గుపడిపోయి ఉంటావు అని అడుగుతాడు రామా.
దీంతో మీ పెళ్లి చూపులప్పుడు ఏం జరిగిందో మాకు చూడాలని ఉంది అని అంటుంది జానకి. దీంతో మాకు కూడా మీ పెళ్లి చూపుల సీన్ ను చూడాలని ఉంది అని అడుగుతారు అందరు. దీంతో పెళ్లి చూపుల సీన్ ను రీక్రియేట్ చేస్తారు. ఇద్దరూ పెళ్లి చూపులకు వచ్చినట్టుగా రెడీ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
This website uses cookies.