will sourya accepts hima in karthika deepam
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 21 మార్చి 2022, ఎపిసోడ్ 1305 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య ఇంకా తన తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అన్నం కూడా తినదు. నా కళ్ల ముందే కారు లోయలో పడిపోయిందని చెప్పి బాధపడుతుంది శౌర్య. ఇంతలో ఇంటికి హిమను తీసుకొని వస్తుంది సౌందర్య. తన బిడ్డ పిల్లలు కూడా వస్తారు. ఇంతలో స్వప్న కొడుకులు ఇంట్లోకి వస్తారు. వాళ్లను చూసి ఆనంద రావు షాక్ అవుతాడు. ఆ తర్వాత సౌందర్య లోపలికి వస్తుంది. తన వెనుకే హిమ కూడా వస్తుంది.
will sourya accepts hima in karthika deepam
హిమను చూసి అందరూ షాక్ అవుతారు. హిమ బతికే ఉందా అని ఆశ్చర్యపోతారు. ఏంటిది సౌందర్య.. హిమ బతికే ఉందా అని అంటారు. శౌర్యకు మాత్రం హిమను చూసి ఎనలేని కోపం వస్తుంది. హిమ.. రా అని ఇంట్లోకి తీసుకెళ్లబోతుంది సౌందర్య. తనను చూసి ఆగు.. అసలు ఎందుకు వచ్చావు అని నిలదీస్తుంది శౌర్య. అమ్మానాన్నలను చంపేశావు కదా. మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది శౌర్య. ఇంకేం చేద్దామని వచ్చావు అని అడుగుతుంది. శౌర్య.. ఏమైందమ్మా నీకు అంటుంది. నానమ్మ తనను లోపలికి తీసుకురావద్దు అంటుంది శౌర్య.
అమ్మానాన్నల చావుకు అదే కారణం అంటుంది శౌర్య. అలా మాట్లాడొద్దు అని చెప్పినా శౌర్య వినదు. కానీ.. శౌర్య మీద సీరియస్ అయి.. హిమను లోపలికి తీసుకెళ్తుంది సౌందర్య. ఇంట్లోకి వెళ్లాక నా రూమ్ లోకి రావద్దు అని అంటుంది శౌర్య. తన చేతి మీద ఉన్న హెచ్ అనే పచ్చబొట్టును చెడిపేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
కానీ.. ఆ పచ్చబొట్టు అస్సలు పోదు. నానమ్మ పచ్చబొట్టు అర్జెంట్ గా తీసేయాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. దీంతో ఈ పచ్చబొట్టు చెరిగిపోదు.. మీ బంధం ఎటూ పోదు అంటుంది సౌందర్య. దీంతో నేను దీనితో కలిసి ఉండను.. దీనితో పడుకోను అంటుంది శౌర్య.
దీంతో వెళ్లండి.. ఇద్దరూ కలిసి పడుకోండి అని బెదిరిస్తుంది సౌందర్య. దీంతో కోపంతో లోపలికి వెళ్లి పడుకుంటుంది శౌర్య. రెండుమూడు రోజుల్లో శౌర్యే నార్మల్ అవుతుంది అని అనుకుంటుంది సౌందర్య. కట్ చేస్తే తెల్లారుతుంది. ఉదయం లేవగానే శౌర్య కనిపించదు. ఇల్లంతా వెతుకుతుంది సౌందర్య.
హిమను అడుగుతుంది. దీంతో హిమ కూడా తనకు తెలియదు అంటుంది. శౌర్య కోసం ఎక్కడ వెతికినా కనిపించదు. ఇంతలో ఆదిత్య వచ్చి ఏమైంది అని అడుగుతాడు. శౌర్య కనిపించడం లేదని చెబుతారు. దీంతో ఆదిత్య ఇల్లంతా వెతుకుతాడు కానీ.. శౌర్య కనిపించదు.
శౌర్య.. ఇంట్లో నుంచి పారిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా గమ్యం లేకుండా ప్రయాణిస్తుంది. కట్ చేస్తే శౌర్య పెరిగి పెద్దవుతుంది. ఓ వ్యక్తిని చితకబాదుతూ కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ గెటప్ వేస్తుంది. వస్తావా అంటావా.. అంటూ ఒకడిని కొడుతుంది.
సారీ అక్క.. తప్పయిపోయింది అక్క అంటాడు. దీంతో ఏమన్నావు అంటూ మరో రెండు పీకుతుంది. దీంతో సారీ చెల్లి అంటాడు. అయినా సరే మరో రెండు పీకుతుంది. ఏంటండి ఇది.. అక్కా అంటే కొట్టారు.. చెల్లి అంటే కూడా కొట్టారు అంటాడు అతడు.
దీంతో తెలుగులో నాకు నచ్చని బంధాలు అక్కా చెల్లి.. అంటుంది. ఆ తర్వాత తన ఆటో మీద వదిలేదేలే… అని రాయించుకుంటుంది శౌర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.