Tamannah – Mehreen : తమన్నా తళుకులు, మెహ్రీన్ మెరుపులు ఎఫ్ 3ని గట్టెక్కిస్తాయా..? అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో చాలా వరకు సీక్వెల్ సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఎఫ్ 3 సినిమా విషయంలో కూడా కొద్దిపాటి సందేహాలు ఉన్నాయంటున్నారు. 2019లో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించిన సినిమా ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సమపాళ్ళలో చూపించి దర్శకుడు అనీల్ రావిపూడి భారీ సక్సెస్ అందుకున్నాడు. ఇలాంటి కథ, కథనాలు బాలీవుడ్‌లో వస్తుంటాయి..భారీ హిట్ సాధిస్తుంటాయి.
మన టాలీవుడ్‌లో కూడా గతంలో క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, సందడే సందడి లాంటి సినిమాలు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని కమర్షియల్‌గా సక్సెస్ సాధించాయి. మళ్ళీ ఇప్పుడు ఈ తరహా పూర్తి కుటుంబ స్థాయి కథా చిత్రాలు వచ్చి భారీ హిట్ సాధిస్తున్నాయి. ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్ 3 చిత్రాన్ని ఇదే తారాగణంతో తెరకెక్కించాడు అనీల్ రావిపూడి. ఇంకా సీక్వెల్ సినిమాలో సోనాల్ చౌహాన్, సునీల్ పాత్రలను యాడ్ చేశారు. ఈ పాత్రల ద్వారా సీక్వెల్ సినిమాలో మరింత ఫన్ అండ్ ఫ్రస్టేషన్ జనరేట్ చేస్తున్నాడట.
ఇక ఎఫ్ 2లో హీరోయిన్స్‌గా నటించిన తమన్నా, మెహ్రీన్ ఎంత గ్లామర్‌గా కనిపించారో అందరికీ తెలిసిందే. ఓ సాంగ్‌లో తమన్నా, మెహ్రీన్ అందాలు ఎంతగా ఆరబోసి ఆకట్టుకున్నారో ఎఫ్ 2 చూసిన వారికి తెలుస్తుంది. ఇప్పుడు అంతకంటే రెట్టింపు స్థాయిలో తమన్నా తళుకులు, మెహ్రీన్ మెరుపులు ఉండబోతున్నాయి. వీరు తమ అందాలతో మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్‌తో కూడా చితక్కొడతారట. వెంకీ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ పాత్రలే సినిమాకు హైలెట్ కానున్నాయి. మొత్తంగా ఎఫ్ 2 కంటే నాలుగింతలు ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో ఎఫ్ 3 సినిమాలో ఉంటుందట. ఇక రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ మరో హైలెట్ కాబోతుంది. చూడాలి మరి అన్నిటికంటే ఎఫ్ 3 సినిమాకు తమన్నా, మెహ్రీన్ ఎంత వరకు ప్లస్ అవుతారో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.