
will tulasi accept ankitha to stay with her in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 20 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 663 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రోజురోజుకూ మ్యూజిక్ క్లాస్ కు వచ్చే పిల్లలు ఎక్కువవుతుండటంతో వాళ్లను కూర్చోబెట్టేందుకు ప్లేస్ లేకపోవడంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. అదే విషయం దివ్యకు చెబుతుంది. పిల్లలకు ఎండ కొడుతోంది అని బాధపడుతుంది. కట్ చేస్తే శృతి, ప్రేమ్ మధ్య చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది. తన తల్లి ఫోటోను ఫోన్ లో చూస్తుంటే.. పెళ్లం ఫోటో చూడాలి కానీ.. అమ్మ ఫోటో చూడటం ఏంటి అంటూ హేళన చేస్తుంది. నాకు అమ్మ తర్వాతనే ఎవరైనా అంటాడు ప్రేమ్. నాతో నిన్ను ఇచ్చి పెళ్లి చేయడం వల్లనే నువ్వు నా దగ్గర ఉన్నావు కదా అంటుంది. అలా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఇంతలో ఇద్దరూ కాసేపు ఏకాంతంగా ఉంటారు. ఇంతలో తన ఫ్రెండ్ వస్తాడు. గుడ్ న్యూస్ చెబుతాడు. నీ ఆల్బమ్ కోసం ఒక స్పాన్సర్ ను ఒప్పించాను అంటాడు.
will tulasi accept ankitha to stay with her in intinti gruhalakshmi
కాకపోతే ముందు ఒక సంవత్సరం పాటు వాళ్ల కంపెనీలో గిటార్ ప్లే చేయాలని చెబుతాడు. అలా అయితే నాకు ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది కదా అంటాడు ప్రేమ్. అవును కానీ.. ఇంకో ఆప్షన్ లేదు కదా అంటాడు ప్రేమ్ ఫ్రెండ్. ఇంకో ఆప్షన్ ఉంది అంటుంది శృతి. తన ఫ్రెండ్ వందన తన ఇల్లు అమ్మకానికి పెట్టిందని చెబుతుంది. తన ఇల్లు అమ్ముడుపోతే నాకు 5 లక్షలు అప్పు ఇస్తానని చెప్పింది అంటుంది. దీంతో అది బెటర్ ఆప్షన్ అంటాడు తన ఫ్రెండ్. మరోవైపు పిల్లల కోసం షెడ్డు వేయడానికి కొలతలు తీసుకుంటూ ఉంటుంది తులసి. పరందామయ్య వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. పిల్లల కోసం ఎండ పడకుండా షెడ్ వేద్దామని అనుకుంటున్నా అంటుంది.
ఎంతమందికి షెడ్ వేస్తావు అని అడుగుతాడు పరందామయ్య. 10 మంది పిల్లలకు అంటుంది. మరి.. 50 పిల్లలు అయితే ఏం చేస్తావు అని అంటాడు. ఇక్కడ పెద్ద షెడ్డు వేసి మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేద్దాం. దానికి సరిపడ ఏర్పాట్లు చేద్దాం అంటాడు పరందామయ్య.
దీంతో తులసికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఏం కాదు.. లోన్ అప్లయి చేసి ఆ డబ్బులతో షెడ్డు వేద్దాం అని చెబుతాడు పరందామయ్య. మరోవైపు భాగ్య.. లాస్యను కలుస్తుంది. ఇంతలో తనకు ఓ వ్యక్తి ఫోన్ చేస్తాడు. తన పేరు భాస్కర్ అని చెబుతాడు.
లోన్ బ్రోకర్ ను అంటాడు. తులసి గారు కాల్ చేశారని.. మ్యూజిక్ స్కూల్ కోసం షెడ్ వేయడానికి లోన్ కావాలని మాట్లాడటానికి రావాలని చెప్పారు అంటాడు. దీంతో తనకు ఎలాగైనా లోన్ రావాలని చెబుతుంది. దీంతో భాగ్య షాక్ అవుతుంది.
లోన్ కోసం ఫేక్ సర్టిఫికెట్లు అయినా సరే నేను ఖర్చు పెట్టుకుంటాను.. ఎలాగైనా తులసికి లోన్ శాంక్షన్ కావాలి అంటుంది. దీంతో సరే మేడమ్ అంటాడు. తర్వాత భాగ్యకు డౌట్ వచ్చి ఎందుకు తులసికి లోన్ ఇప్పిస్తున్నావు అని అడుగుతుంది. దీంతో తులసికి తెలియకుండా లోన్ డబ్బులు తులసికి శాంక్షన్ చేయించి బ్రోకర్ ను అడ్డు పెట్టుకొని బ్లాంక్ చెక్ సంపాదించి.. లోన్ అమౌంట్ బ్యాంకులో పడగానే నా బ్యాంకులోకి ట్రాన్స్ ఫర్ చేసుకుంటా అంటుంది లాస్య.
మరోవైపు అంకిత.. బ్యాగు సర్దుకొని వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది. వద్దు ఆగు అంటుంది గాయత్రి. నీ దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు కోసమే తులసి నిన్ను దగ్గరకు తీసుకుంది అంటుంది. నీ ఆలోచన తప్పు అని నీకు తెలిసేలా చేస్తా అంటుంది అంకిత. నీకు ఈ మమ్మీ మాట మీద లెక్కలేదా అంటుంది గాయత్రి.
నిజంగా నేను కావాలనుకుంటే ఆ ఇంటికి రా. నీకోసం వెయిట్ చేస్తుంటాను అంటుంది అంకిత. మరోవైపు తులసి ఇంట్లో అడుగుపెడుతుంది అంకిత. తెల్లారి గాయత్రి తులసి ఇంటికి వెళ్లి.. నా కూతురును నా ఇంటికి పంపిస్తావా లేదా అని తులసిని ప్రశ్నిస్తుంది.
నందు, లాస్య కూడా గాయత్రికి తోడుగా వెళ్తారు. అంకితకు ఇష్టం లేకుండా ఏ ఒక్కరైనా అంకితను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూస్తే ఇక్కడ జరిగేది కురుక్షేత్ర యుద్ధమే అని చెప్పి గాయత్రితో పాటు నందు, లాస్యకు వార్నింగ్ ఇస్తుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.