Yash Fan : రాఖీ భాయ్ లా చేద్దామనుకున్నాడు.. చివరకు హాస్పిటల్ లో చేరాడు..
Yash Fan : సాధారణంగా సినిమాల ప్రభావం యువతపై కాస్తా ఎక్కువగానే ఉంటుంది. తమ అభిమాన హీరోలు సినిమాల్లో ఎలా చేస్తే అలా వీళ్లు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. హీరోల డ్రెస్సింగ్, స్టైల్ ఇలా అన్నీ ఫాలో అవుతుంటారు. ఓక్కోసారి వీళ్ల అభిమానం ఫీక్స్ కి వెళ్తుంది. అభిమాన హీరో పేరు టాటూ వేయించుకోవడం.. వాళ్ల పేర్లు రాసుకోవడం చేస్తుంటారు. అలాగే సినిమా రిలీజ్ అప్పుడు కటౌట్లు.. పాలాభీషేకాలతో థియేటర్ల వద్ద తెగ సందడి చేస్తారు. ఇక కొంతమంది అయితే హీరో సినిమాలో చేసిన స్టంట్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు తమ అభిమాన హీరో సినిమా అప్డేట్ ఇవ్వకపోయినా చావడానికో చంపడానికో అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు.
అలాగే కొంతమంది సినిమాల్లో ఉండే దొంగతనాలు, మర్డర్లు, హీరోలు చేసే రిస్క్ లు వంటి సీన్లను కూడాచూసి అదే ఫాలో అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్నామధ్య ఓ ఖైది సినీఫక్కీలో తప్పించుకున్నాడు. పోలీసులు కూడా అదే రేంజ్ లో చేస్ చేసి పట్టుకున్నారు. రీసెంట్ గా సినిమా అప్డేట్ ఇవ్వలేదని ఓ అభిమాని సూసైడ్ లెటర్ రాసి ఆ డైరెక్టర్ ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా సినిమాల ప్రభావం యువతపై ఎంతగా ఉందో ఈ ఇలాంటివి చూస్తూ అర్థమవుతుంది.
మరికొంత మంది తమ అభిమాన హీరో నడిపే బైక్ ను కొనాలనుకుంటారు. మరికొంత మంది హీరోలు సినిమాల్లో డ్రింక్, స్మోకింగ్ చేసే సీన్లను ఫాలో అవుతుంటారు. కాగా ప్రస్తుతం ఓ అభిమాని తమ హీరో ఓ సినిమాలో స్మోకింగ్ చేయగా అతను అలాగే ప్రయత్నించి హాస్పిటల్ లో చేరాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ మూవీ హీరో యష్ స్మోకింగ్ చేస్తాడు. సేమ్ అలానే చేయడానికి ఓ హైదరాబాద్ కుర్రాడు ప్రయత్నించాడు. ఓ ప్యాక్ మొత్తం తాగేయడంతో గొంతు నొప్పితో బాధపడుతూ పేరెంట్స్ కి చెప్పడంతో హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ఎక్కువగా టీనేజ్ లో ఉన్న వాళ్లు ఇలా చేస్తున్నారు. తమ అభిమాన హీరోలు ఎలా చేస్తే అలా చేయడం చివరకి ప్రమాదాల బారిన పడుతున్నారు.