Jr NTR : ఎన్టీఆర్ సినిమా ఒప్పుకుని తప్పు చేసిందా.. హీరోయిన్ మూడేళ్లు లాక్ చేశారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : ఎన్టీఆర్ సినిమా ఒప్పుకుని తప్పు చేసిందా.. హీరోయిన్ మూడేళ్లు లాక్ చేశారా..?

 Authored By ramesh | The Telugu News | Updated on :4 March 2025,6:20 pm

ప్రధానాంశాలు:

  •  Jr NTR : ఎన్టీఆర్ సినిమా ఒప్పుకుని తప్పు చేసిందా.. హీరోయిన్ మూడేళ్లు లాక్ చేశారా..?

Jr NTR : మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా నో చెప్పే ఛాన్స్ లేదు. ఐతే స్టార్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటే హీరోయిన్ గా కెరీర్ లో స్టార్ రేంజ్ తెచ్చుకున్నట్టే లెక్క. అందుకే ఒక కన్నడ హీరోయిన్ ఆ ఆలోచనతోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసే సినిమాకు సైన్ చేసింది. ఐతే సైన్ చేశాక తెలిసింది ఆమె ఎంత పెద్ద పొరపాటు చేసిందో. ఎన్టీఆర్ సినిమా ఒప్పుకుని తప్పు పని చేశా అని అమ్మడు ఫీల్ అవుతుందట. అదేంటి ఎన్టీఆర్ తో సినిమా చేస్తూ అలా ఎందుకు భావిస్తుంది అంటే.. మూడేళ్ల పాటు ఆ సినిమాకే పనిచేయాలని మరో సినిమాకు డేట్స్ ఇవ్వకూడదని కండీషన్ పెట్టడమే దీనికి కారణమని తెలుస్తుంది. కన్నడ నుంచి వచ్చిన రుక్మిణి వసంత్ సౌత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మడు ఇప్పటికే నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది.

Jr NTR ఎన్టీఆర్ సినిమా ఒప్పుకుని తప్పు చేసిందా హీరోయిన్ మూడేళ్లు లాక్ చేశారా

Jr NTR : ఎన్టీఆర్ సినిమా ఒప్పుకుని తప్పు చేసిందా.. హీరోయిన్ మూడేళ్లు లాక్ చేశారా..?

Jr NTR : ఎంత పెద్ద సినిమా ఛాన్స్ వచ్చినా సరే..

నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో నటిస్తుంది. ఐతే ఎన్టీఆర్ తో సినిమా అంటే రుక్మిణి ఫేట్ మారినట్టే అని ఫిక్స్ అయ్యింది. అంతా బాగుంది కానీ రుక్మిణి ఎన్టీఆర్ సినిమా చేసే టైం లో మరో సినిమాకు సైన్ చేయకూడదని కండీషన్ పెట్టారట.సినిమా 2, 3 ఏళ్లు పడుతుంది కాబట్టి ఈలోగా ఎంత పెద్ద సినిమా ఛాన్స్ వచ్చినా సరే అమ్మడు చేయకూడదని అన్నార్ట. చేసేదేమి లేక కండీషన్స్ కి రుక్మిణి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఐతే 2, 3 ఏళ్లు ఈ సినిమా కోసం ఇస్తున్నందుకు అదుకు తగిన రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.

అమ్మడు ఆ రెమ్యునరేషన్ కి కన్విన్స్ అయ్యే ఆ సినిమా పూర్తయ్యే దాకా మరో సినిమా చేయనని ఒప్పేసుకుందట. మొత్తానికి రుక్మిణి వసంత్ కి స్టార్ ఛాన్స్ అని సంబరపడితే తీరా ఆ సినిమా మొదలవడానికి ముందే రుక్మిణికి పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది. సో తెలుగులో రుక్మిణి మరో సినిమా చేయాలంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ అయ్యాకనే అని తెలుస్తుంది. Jr NTR, Prashanth Neel, Rukmini Vasanth, Tarak, PAN India

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది