Yash : రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను మించిన పోయిన కన్నడ హీరో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Yash : రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను మించిన పోయిన కన్నడ హీరో..

 Authored By govind | The Telugu News | Updated on :3 May 2022,8:33 pm

Yash : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇటు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పాన్ ఇండియన్ స్టార్స్‌గా మన టాలీవుడ్ హీరోలు ప్రభాస్‌ను మించి పోతారని అందరూ భావించారు. కానీ, ఎందుకనో ఈ ఇద్దరు హీరోలకు ఆ రేంజ్ క్రేజ్ రాలేదనే టాక్ వినిపిస్తోంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అని పేరుకు ముందు చేర్చుతున్నారు.

ఇక గత ఏడాది చివరిలో పుష్ప పార్ట్ 1 సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా ఐకాన్ స్టార్ ఇమేజ్‌తో పాటు పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ సక్సెస్ అందుకున్నాడు. సోలో హీరోగా వచ్చిన పుష్ప హిందీలో కూడా ఊహించని వసూళ్ళు రాబట్టింది. అయితే, బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన ప్రశాంత్ నీల్ – యష్‌ల కేజీఎఫ్ ఛాప్టర్ 1 పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ సక్సెస్ అందుకుంది. అందుకే, ప్రభాస్ తర్వాత సౌత్ నుంచి ఆ స్థాయి హీరో యష్ అని చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మళ్ళీ అంతే అంచనాలతో అంతే భారీ స్థాయిలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 వచ్చింది.

Yash: ఆర్ఆర్ఆర్ కంటే కూడా యష్ సినిమాకే ఎక్కువ..

ఈ సినిమాతో కూడా దర్శకుడిగా ప్రశాంత్ నీల్ – హీరోగా యష్‌లు అందుకున్న సక్సెస్ ఏంటో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇటీవల వచ్చిన మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో మళ్ళీ ఎక్కువ శాతం కేజీఎఫ్ 2 సినిమానే థియేటర్స్‌లోకి తీసుకువచ్చారు గానీ, ఆర్ఆర్ఆర్ సినిమాను తీసుకుంది చాలా తక్కువ. అంటే దీనిని బట్టి కేజీఎఫ్ సిరీస్ సినిమాలకు యష్‌కు ఎంతటి క్రేజ్ దక్కుతుందో అర్థమవుతుంది. ఇక వసూళ్ళ పరంగా చూస్తే కూడా ఇద్దరు స్టార్స్ ఉన్న ఆర్ఆర్ఆర్ కంటే కూడా యష్ సినిమాకే ఎక్కువ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. దీనిని ఆధారంగా చేసుకొనే చరణ్, ఎన్.టి.ఆర్‌ల కంటే కూడా ఇప్పుడు యష్ క్రేజ్ రెట్టింపు ఉందని చెప్పుకుంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది