
young hero comments on pawan kalyan bheemla nayak
Bheemla Nayak : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కు పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరియు రానా ల నటన ఇంకా త్రివిక్రమ్ రచనపై అభినందనలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఎంతో మంది ఇండస్ట్రీ వర్గాల వారు సోషల్ మీడియా ద్వారా భీమ్లా నాయక్ గురించి స్పందించడం జరిగింది. ఈ సమయంలో ఒక యంగ్ హీరో చేసిన ట్వీటు చర్చనీయాంశంగా మారింది. ఆ యంగ్ హీరో సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ మరియు రానాల పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇలాంటి ఒక మంచి సినిమా తీసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతో మంది స్టార్స్ భీమ్లా నాయక్ గురించి మాట్లాడారు.
కానీ ఆయన చేసిన ట్వీట్ మాత్రం చాలా స్పెషల్ గా నిలిచింది. ఎందుకంటే ఆయన తండ్రి మరియు అన్న ఇద్దరు కలిసి గతంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించడం జరిగింది. ఈ మధ్య కూడా వారిద్దరూ చాలా దారుణంగా మెగా ఫ్యామిలీ విషయంలో వ్యవహరించారు. అలాంటి వారి కుటుంబం కు చెందిన హీరో భీమ్లా నాయక్ గురించి ఇంత సాఫ్ట్ గా మాట్లాడటం మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఆ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి నుండి ఇలాంటి ఒక ట్వీట్ రావడంతో ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మెగా అభిమానులు అంఆత కూడా ఇదెక్కడి విడ్డూరం అన్నట్లుగా అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.ఆ తండ్రి కొడుకులకు చాలా విభిన్నంగా ఇతడు ఉన్నాడు. వారి వారిద్దరూ కూడా చిన్నవాడైన ఇతడిని చూసి నేర్చుకో వచ్చు. ఒక మంచి సినిమాను ఎలా ఆదరించాలి.. ఎలా గౌరవించాలి.. ఇతరుల పట్ల చాలా గౌరవంగా ఎలా ఉండాలి
young hero comments on pawan kalyan bheemla nayak
అనే విషయాన్ని ఈ యంగ్ హీరో ని చూసి ఆ తండ్రి కొడుకు లు తెలుసుకోవచ్చు. వారిద్దరూ కూడా ఇండస్ట్రీలో ఇప్పటికే పలు వివాదాలను మూట గట్టుకున్నారు సోషల్ మీడియాలో కూడా వాళ్లు అంటే అస్సలు పడని వారు ఎంతో మంది ఉన్నారు, అయినా కూడా వారి అతి ప్రవర్తన మాత్రం మారదు. ఇప్పుడు ఈ యువ హీరో ని చూసి అయినా వారిద్దరూ బుద్ధి తెచ్చుకోవాలని, ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మెగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నవాడైనా కూడా ఇతడు చేసిన పనికి ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. సినిమా హిట్టయితే అభినందించడం చాలా మంచి విషయం, కానీ ఇప్పటి వరకు ఆ ఇద్దరు తండ్రి కొడుకులు మాత్రం అభినందించలేదు. ఆ తండ్రి కొడుకులు గురించి పట్టించుకోకుండా వాళ్ల కుటుంబానికి చెందిన ఈ హీరో భీమ్లా నాయక్ సినిమా గురించి స్పందించడం అభినందనీయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.