Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించింది. గత 52 రోజుల నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను గత నెలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఆయన్ను అరెస్ట్ చేశారు. 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉంటున్నారు. చంద్రబాబు రిమాండ్ ను ఇప్పటి వరకు పెంచుతూ వచ్చారు. చాలాసార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా చంద్రబాబుకు కోర్టులు బెయిల్ మంజూరు చేయలేదు. చివరకు అనారోగ్య కారణాల వల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించుకోవడంతో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ఆయన మధ్యంతర బెయిల్ పై తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనకు ముందు 14 రోజుల రిమాండ్ ను విధించింది కోర్టు. ఆ తర్వాత మళ్లీ తన రిమాండ్ ను పెంచుతూ వెళ్లింది కోర్టు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టులో దాఖలు చేయగా.. హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. సోమవారమే ఇరు వైపుల వాదనలు ముగియడంతో తీర్పును ఇవాళ్టికి వాయిదా వేశారు. తాజాగా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.
నాలుగు వారాల అనంతరం అంటే.. నవంబర్ 24న మళ్లీ చంద్రబాబు సరెండర్ కావాల్సి ఉంటుంది. ఇక.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రధాన బెయిల్ పిటిషన్ పై నవంబర్ 10న విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది. ఇప్పటికే చంద్రబాబుకు కంటి సమస్య వేధిస్తోంది. జైలుకు వెళ్లడానికి ముందే ఆయన ఎడమ కన్నుకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు కుడి కన్నుకు కూడా ఆపరేషన్ చేయాల్సి ఉన్నందున మధ్యంతర బెయిల్ ను హైకోర్టు ఇచ్చింది.
Aadhar Card New Rules : ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలు…
8 Vasanthalu Movie Review : ‘MAD’ ఫేమ్ అనంతికా సానిల్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘8 వసంతాలు’ చిత్రం…
Ghee Vs Chapati : చపాతీలను కాల్చేటప్పుడు కొందరు నూనెను వేస్తుంటారు. మరికొందరు నెయ్యిని వేసి కాల్చుతుంటారు. కొందరైతే నెయ్యిని…
Lord Shsni : జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, అందులో శనీశ్వరుడు కి ఎంతో ప్రాధాన్యత…
Green Tea : ఈ రోజుల్లో గ్రీన్ టీ తాగడంలో ఒక టైంలో భాగంగా మారింది. ఇది ఆరోగ్యానికి ఎంతో…
Saffron Remedies : వ్యక్తి కర్మ ఫలాలను బట్టి గ్రహదోషాలు వెంటాడుతూ ఉంటాయి. గ్రహ దోష నివారణ జరగాలంటే గుడిలో…
Parameshwar Reddy : నాచారం మహంకాళి దేవాలయం అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన ఛైర్మెన్ ధర్మ కర్తలు బాధ్యతతో కృషి చేయాలని…
Parameshwar Reddy : ఈరోజు గురుపౌర్ణమి guru purnima సందర్భంగా సీనియర్ Congress కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ…
This website uses cookies.