Big Breaking : టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్.. చంద్రబాబుకు బెయిల్.. సంతోషంలో నారా ఫ్యామిలీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Big Breaking : టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్.. చంద్రబాబుకు బెయిల్.. సంతోషంలో నారా ఫ్యామిలీ

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించింది. గత 52 రోజుల నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను గత నెలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఆయన్ను అరెస్ట్ చేశారు. 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉంటున్నారు. చంద్రబాబు రిమాండ్ ను ఇప్పటి వరకు పెంచుతూ వచ్చారు. చాలాసార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా చంద్రబాబుకు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :31 October 2023,10:48 am

ప్రధానాంశాలు:

  •  చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు

  •  నవంబర్ 24న మళ్లీ సరెండర్ కానున్న చంద్రబాబు

  •  చంద్రబాబును వేధిస్తున్న కంటి సమస్య

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించింది. గత 52 రోజుల నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను గత నెలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఆయన్ను అరెస్ట్ చేశారు. 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉంటున్నారు. చంద్రబాబు రిమాండ్ ను ఇప్పటి వరకు పెంచుతూ వచ్చారు. చాలాసార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా చంద్రబాబుకు కోర్టులు బెయిల్ మంజూరు చేయలేదు. చివరకు అనారోగ్య కారణాల వల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించుకోవడంతో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ఆయన మధ్యంతర బెయిల్ పై తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనకు ముందు 14 రోజుల రిమాండ్ ను విధించింది కోర్టు. ఆ తర్వాత మళ్లీ తన రిమాండ్ ను పెంచుతూ వెళ్లింది కోర్టు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టులో దాఖలు చేయగా.. హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. సోమవారమే ఇరు వైపుల వాదనలు ముగియడంతో తీర్పును ఇవాళ్టికి వాయిదా వేశారు. తాజాగా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.

నాలుగు వారాల అనంతరం అంటే.. నవంబర్ 24న మళ్లీ చంద్రబాబు సరెండర్ కావాల్సి ఉంటుంది. ఇక.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రధాన బెయిల్ పిటిషన్ పై నవంబర్ 10న విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది. ఇప్పటికే చంద్రబాబుకు కంటి సమస్య వేధిస్తోంది. జైలుకు వెళ్లడానికి ముందే ఆయన ఎడమ కన్నుకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు కుడి కన్నుకు కూడా ఆపరేషన్ చేయాల్సి ఉన్నందున మధ్యంతర బెయిల్ ను హైకోర్టు ఇచ్చింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది