
Modi
Modi : ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం మెతేర స్టేడియంకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పేరును పెట్టిన విషయం తెల్సిందే. ప్రముఖులు ఉన్న సమయంలో ఆయన పేరును పెట్టడంపై పలువురు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు. మోడీ పేరు పెట్టడంపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న సమయంలో అనూహ్యంగా ఆ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ అంత్యత దారుణమైన రికార్డును మూట కట్టుకుంది. అయిదు రోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్ కాస్త కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. టీం ఇండియా మరియు ఇంగ్లాండ్ లు హోరా హోరీగా పోరాటం చేసి ఏదో ఒక జట్టు అద్బుతమైన విజయాన్ని దక్కించుకుంటుందని భావించారు. కాని అనూహ్యంగా మ్యాచ్ ఓడిని వారికి గెలిచిన వారికి ఇద్దరికి కూడా సంతృప్తి లేకుండా పోయింది. ఇక మ్యాచ్ చూసిన ప్రేక్షులు ఇదేం మ్యాచ్ అంటూ విమర్శలు చేశారు.
స్టేడియంకు మోడీ పేరు పెట్టడం ఏమాత్రం కలిసి రాలేదు అంటున్నారు. మోడీ తరహాలోనే ఆ స్టేడియంలో కూడా జెట్ స్పీడ్ తో బ్యాట్స్ మన్ లు ఆట ఆడకుండా వెనక్కు వచ్చారు అంటూ కొందరు, మోడీ పేరుతో ఉన్న స్టేడియంలో ఆటగాళ్లు ఎక్కువ కాలం ఆడేందుకు ఆసక్తి చూపలేదు. అందుకే రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ను ముగించి మరో స్టేడియంకు వెళ్లారు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెట్రోల్ ధరను మోడీ సెంచరీ కొట్టిస్తున్న సమయంలో మేము సెంచరీలు కొట్టినా ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశ్యంతో ఆటగాళ్లు కనీసం ఆఫ్ సెంచరీలు కూడా చేయలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Modi
ఈ పిచ్ పై టీం ఇండియా గెలవాలనే ఉద్దేశ్యంతో స్పీన్ బౌలర్లకు ఉపయోగదాయకమైన పిచ్ ను తయారు చేయడం జరిగింది. టీం ఇండియా బౌలర్లు ఎలాగూ స్పిన్ తో మాయాజాలం చేయగలరు. అందుకే స్పీన్ కు అనుకూలంగా మార్చి మొదటి టెస్టును తమకు అనుకూలంగా మార్చుకోవాలంటూ బీసీసీఐ భావించిందా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి టీం ఇండియా వారు గెలిచినా కూడా ఇది మోడీ పేరుతో ప్రారంభం అయిన స్టేడియం అవ్వడం వల్ల మొదటి టెస్టు మ్యాచ్ ను వారికి అనుకూలంగా మల్చుకున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కొందరు అసలు మోడీ స్టేడియంను బ్యాన్ చేయాలని మరి కొందరు ఐసీసీ కి ఫిర్యాదు చేస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.