Home » Exclusive » Amla Murabba Recipe In Telugu
Exclusive

Amla Murabba Recipe : నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మిఠాయి… రోజుకి ఒకటి తింటే చాలు 100ఏళ్ల ఆరోగ్యం…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 29, 2022 12:28 pm
Advertisement

Amla Murabba Recipe : ఈరోజు మనం చేయబోయే రెసిపీ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఆమ్లం మురబ్బా స్వీట్ ని చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ సీజన్లో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. ఉసిరిలో ఎన్నో పోషక విలువలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ ఉసిరికాయలతో స్టోర్ చేసుకునే ఉసిరికాయ స్వీట్ తయారు చేసుకోబోతున్నాం.. దీనిని వంద రోజులు వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీనివలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవి… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఆమ్లం మురబ్బా ఎలా నిలువ చేసుకోవాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : ఉసిరికాయలు, కండ చెక్కర, శొంఠి, యాలకులపొడి మిరియాల పొడి, ఉప్పు,

Advertisement

దీని తయారీ విధానం : ముందుగా ఒక 20 ఉసిరికాయల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నె తీసుకొని వాటిని గిన్నెలో వేసి వాటిలో నీటిని పోసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇక మరునాడు వాటిని తీసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ సహాయంతో తుడిచి వాటికి ఫోర్క్ సహాయంతో గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయల్ని ఆవిరికి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి.తర్వాత పట్టిక బెల్లాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకోవాలి. ఆ పౌడర్ ని ఒక కప్పు తీసుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ పట్టిక పౌడర్ ని వేసుకోవాలి. అయితే ఇది ముఖ్యంగా స్టీల్ గిన్నెలో మాత్రమే చేసుకోవాలి. ఇక ఆ పౌడర్ లో ముందుగా ఆవిరిపై ఉడికించుకున్న ఉసిరికాయల్ని కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి.

Amla Murabba Recipe in Telugu

Advertisement

అలా కలుపుతూ ఉండగా పాకం లాగా వచ్చేసి ఆ పాకంలో ఉసిరికాయలు ఉడుకుతూ ఉంటాయి. అలా 20 30 నిమిషాల పాటు ఉడికించగా ఉసిరికాయలు ఎర్రగా అవుతాయి. పాకం కూడా ముదురు రంగులోకి వస్తుంది. ఆ విధంగా వచ్చిన దానిలో కొంచెం యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం సొంటి పొడి, వేసి తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ పై నుంచి దింపి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఆ విధంగా చల్లారిన వాటిని తీసి గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న ఆమ్లం మురబ్బా రోజుకి ఒకటి తింటే చాలు 100 సంవత్సరాల ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.. ఒకవేళ ఈ ఉసిరికాయలు తిన్న తర్వాత ఆ పాకం మిగిలితే దానిలో కొంచెం నిమ్మరసం పిండుకొని తాగవచ్చు. అలా కూడా ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి