Chicken Mandi Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి మండి బిర్యాని.. ఈ మండి బిర్యానీ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండీగా నడుస్తుంది.. దీనిని ఎక్కువగా రెస్టారెంట్ లోని మనం తింటూ ఉంటారు. అదే టేస్ట్తో ఇప్పుడు మనం ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకోబోతున్నాం… దీన్ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్ లు, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, బాస్మతి రైస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ,కొంచెం పెరుగు, షాజీరా, డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్, కారం, ఉప్పు, పసుపు, బిర్యానీ మసాలా, మండి మసాలా, ధనియాలపౌడర్ డ్రై లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ , నిమ్మరసంమొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఈ చికెన్ మండి కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి.
ఈ మసాలా కి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ జీలకర్ర, ధనియాలు, మిరియాలు, సోంపు ,యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, నల్లాయాలకులు, జాపత్రి వీటన్నిటిని కలిపి మసాలా పట్టుకోవాలి. తర్వాత మూడు చికెన్ లెగ్ పీసులు తీసుకుని వాటిని ఘాట్లు పెట్టుకోవాలి. ముందుగా పట్టుకున్న మసాలాని ఒక గిన్నెలో 2 స్పూన్స్ వేయాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేయాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు, కొంచెం నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కుంకుమపువ్వు పాలు కూడా వేసుకోవాలి. దానిలో కొంచెం ఆయిల్ కూడా వేసి దీన్ని పేస్టులా చేసుకుని ఈ లెగ్ పీస్ లకి అంత బాగా పట్టించుకోవాలి. ఈ లెగ్ పీస్ ని ఒక మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత తర్వాత ఒక ఇడ్లీ గిన్నె తీసుకొని ఒక ఐదు గ్లాసులు వాటర్ పోయాలి.
ఒక స్టీమర్ గిన్నెను దాన్లో పెట్టుకోవాలి.ఆస్టిమార్ లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లేగ్ పీసుల్ని పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మళ్లీ ఒక 25 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక తర్వాత రెండు గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఉడికిపోయిన ఈ లెగ్ పీసుల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక బిర్యానీ గిన్నెను పెట్టి దానిలో ఆయిల్ కొంచెం వాటర్ వేసి కరిగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. దానిలో ఒక టీ స్పూన్ అల్లం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో ఒక స్పూన్ మండి మసాలా వేయాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరి కూడా వేసి కలుపుకోవాలి.
తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా చికెన్ ని స్టీమ్ చేసిన వాటర్ ని గ్లాస్ ఉన్నారా వాటర్ అవి పోసి తర్వాత మరో రెండు గ్లాసులు వాటర్ ని పోసి బాగా మరగనివ్వాలి. తర్వాత డ్రై లెమన్ కూడా దాన్లో వేసుకోవాలి. తర్వాత చికెన్ స్టాప్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ ని స్లో పెట్టుకొని మరో ఆరు ఏడు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. మరొకసారి కలుపుకొని మరి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే ఈ రైసు రెడీ అయిపోతుంది.
ఇక ఈ రైస్ లో ఒక గిన్నె పెట్టి దానిలో బొగ్గు వేసి ఆ బొగ్గు మండుతుండగా కొంచెం నెయ్యి వేసి ఆ పొగ వస్తుండగా మూత పెట్టి అంత పట్టేలా చూసుకోవాలి. ఇక తర్వాత ఒకపక్క ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఈ లెగ్ పీస్ ని తీసుకొని ఆయిల్ లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. దీనిలో కూడా బొగ్గుల పొగ పట్టించాలి మళ్ళీ.. తరువాత మూత తీసి ఈ లెగ్ పీసులు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మండి రైస్నంత ఒక ప్లేట్ లో వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని కొన్ని డ్రైఫ్రూట్స్ ని వేయించుకొని తీసుకున్న వాటిని కూడా అంత స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న లెగ్ పీసుల్ని కూడా వేసి రెడీ చేసుకోవడమే.. అంతేనండి మండి బిర్యానీ ఎంతో సింపుల్గా ఇంట్లో కూడా రెడీ అయిపోయింది…
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.