Chicken Mandi Recipe : చికెన్ మండి డిఫరెంట్ టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది.. ఒకసారి ఇలా ట్రై చేయండి…!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 10, 2023, 7:40 am

Chicken Mandi Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి మండి బిర్యాని.. ఈ మండి బిర్యానీ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండీగా నడుస్తుంది.. దీనిని ఎక్కువగా రెస్టారెంట్ లోని మనం తింటూ ఉంటారు. అదే టేస్ట్తో ఇప్పుడు మనం ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకోబోతున్నాం… దీన్ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు :  చికెన్ లెగ్ పీస్ లు, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, బాస్మతి రైస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ,కొంచెం పెరుగు, షాజీరా, డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్, కారం, ఉప్పు, పసుపు, బిర్యానీ మసాలా, మండి మసాలా, ధనియాలపౌడర్ డ్రై లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ , నిమ్మరసంమొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఈ చికెన్ మండి కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి.

ఈ మసాలా కి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ జీలకర్ర, ధనియాలు, మిరియాలు, సోంపు ,యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, నల్లాయాలకులు, జాపత్రి వీటన్నిటిని కలిపి మసాలా పట్టుకోవాలి. తర్వాత మూడు చికెన్ లెగ్ పీసులు తీసుకుని వాటిని ఘాట్లు పెట్టుకోవాలి. ముందుగా పట్టుకున్న మసాలాని ఒక గిన్నెలో 2 స్పూన్స్ వేయాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేయాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు, కొంచెం నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కుంకుమపువ్వు పాలు కూడా వేసుకోవాలి. దానిలో కొంచెం ఆయిల్ కూడా వేసి దీన్ని పేస్టులా చేసుకుని ఈ లెగ్ పీస్ లకి అంత బాగా పట్టించుకోవాలి. ఈ లెగ్ పీస్ ని ఒక మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత తర్వాత ఒక ఇడ్లీ గిన్నె తీసుకొని ఒక ఐదు గ్లాసులు వాటర్ పోయాలి.

Chicken Mandi Recipe in Telugu

Chicken Mandi Recipe in Telugu

ఒక స్టీమర్ గిన్నెను దాన్లో పెట్టుకోవాలి.ఆస్టిమార్ లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లేగ్ పీసుల్ని పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మళ్లీ ఒక 25 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక తర్వాత రెండు గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఉడికిపోయిన ఈ లెగ్ పీసుల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక బిర్యానీ గిన్నెను పెట్టి దానిలో ఆయిల్ కొంచెం వాటర్ వేసి కరిగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. దానిలో ఒక టీ స్పూన్ అల్లం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో ఒక స్పూన్ మండి మసాలా వేయాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరి కూడా వేసి కలుపుకోవాలి.

తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా చికెన్ ని స్టీమ్ చేసిన వాటర్ ని గ్లాస్ ఉన్నారా వాటర్ అవి పోసి తర్వాత మరో రెండు గ్లాసులు వాటర్ ని పోసి బాగా మరగనివ్వాలి. తర్వాత డ్రై లెమన్ కూడా దాన్లో వేసుకోవాలి. తర్వాత చికెన్ స్టాప్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ ని స్లో పెట్టుకొని మరో ఆరు ఏడు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. మరొకసారి కలుపుకొని మరి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే ఈ రైసు రెడీ అయిపోతుంది.

ఇక ఈ రైస్ లో ఒక గిన్నె పెట్టి దానిలో బొగ్గు వేసి ఆ బొగ్గు మండుతుండగా కొంచెం నెయ్యి వేసి ఆ పొగ వస్తుండగా మూత పెట్టి అంత పట్టేలా చూసుకోవాలి. ఇక తర్వాత ఒకపక్క ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఈ లెగ్ పీస్ ని తీసుకొని ఆయిల్ లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. దీనిలో కూడా బొగ్గుల పొగ పట్టించాలి మళ్ళీ.. తరువాత మూత తీసి ఈ లెగ్ పీసులు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మండి రైస్నంత ఒక ప్లేట్ లో వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని కొన్ని డ్రైఫ్రూట్స్ ని వేయించుకొని తీసుకున్న వాటిని కూడా అంత స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న లెగ్ పీసుల్ని కూడా వేసి రెడీ చేసుకోవడమే.. అంతేనండి మండి బిర్యానీ ఎంతో సింపుల్గా ఇంట్లో కూడా రెడీ అయిపోయింది…

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tummala Nageswara Rao : కాంగ్రెస్ మళ్లీ గెలవడం కష్టమే.. నేనూ పోటీ చేయను.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు!"

  2. "Gold Rate Today : తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం.. నిపుణుల అంచనాలివే!"

  3. "Karthika Deepam 2 Today Episode : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  4. "Cheyutha Pensions : రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్‌.. 4,63,857 మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న నగదు జమ..!"

  5. "Gold Rate Today : బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. వరుసగా దిగొస్తున్న ధరలు.. 2026 నవంబర్ 16న తాజా రేట్లు ఇవే!"

  6. "Cyclone Akvan 2026 : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. నవంబర్ 19, 20 తేదీల్లో అతి భారీ వర్షాలు..!"

  7. "Electricity Units : ఒక యూనిట్ కరెంట్ అంటే ఎంత? మీ ఇంట్లో ఏ పరికరం ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతుంది? ఈ లెక్క తెలిస్తే బిల్లు తగ్గించుకోవచ్చు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp