KTR Chit Chat : తాజాగా మంత్రి కేటీఆర్ అశోక్ నగర్ లోని నిరుద్యోగులతో సమావేశమై దాదాపుగా రెండు గంటల పాటు వారితో చర్చించారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నియామక ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తి చేస్తాం అన్నారు. నోటిఫికేషన్ విషయంలో అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాతి రోజు అశోక్ నగర్ లో యువతతో సమావేశమై వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామన్నారు .
యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన అంతకుమించే ఇచ్చామన్నారు కేటీఆర్. 2.3 లక్షలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటికే 1,62,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన మరో రాష్ట్రం ప్రభుత్వం లేదన్నారు. తమపై కేవలం రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలని యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియలో సమస్యల కారణంగా నెలకొన్న ఆందోళనను కేటీఆర్ కు తెలియజేశారు ఉద్యోగార్థులు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్ట్ ల సంఖ్య పెంచాలని యువత కోరారు. గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దాదాపుగా దశాబ్ద కాలం పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసిన అనుభవం తనకు ఉందన్న కేటీఆర్ ఈ విషయంలో యువతకు ఒక సోదరిడిగా భరోసా ఇస్తున్నానని ఆయన యువతకు తెలిపారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.