Gulabi Puvullu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులు. ఈ గులాబీ పువ్వులు ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి. జనరల్ గా మనకి ఏదైనా స్నాక్స్ లాగా చేసుకోవాలనుకున్నప్పుడైనా ఇలా చేసి పెట్టుకున్నారు అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇవి మనకి వన్ మంత్ వరకు స్టోర్ కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.. ఈ గులాబీ పువ్వులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి, గోధుమపిండి, పంచదార, యాలకుల పొడి, ఉప్పు కొబ్బరిపాలు, నీళ్లు, ఆయిల్, మొదలైనవి… దీని తయారీ విధానం : ఈ గులాబీ పువ్వులు కోసం ముందుగా మిక్సీజార్లో ఒక కప్పు పంచదార వేసి దాన్లో యాలకులు కూడా వేసి మంచిపొడిలా చేసి పెట్టుకోవాలి. ఈ చక్కెర పొడిని ఒక గిన్నెలో పోసుకోవాలి.
ఇక ఈ పంచదార మిశ్రమంలోకి బియ్యం పిండి రెండు కప్పులు వేసుకోవాలి.అలాగే దానిలో ఇంకొక కప్పు గోధుమపిండి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు కొబ్బరి పాలు పోసుకోవాలి. తర్వాత ఇంకొక కప్పు నీటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు కొబ్బరి పాలు పడతాయి. వీటిని పోసి విస్కర్ తీసుకొని ఒకటే వైపు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా ఉండకూడదు. మరీ పల్చగా ఉండొద్దు.. ఒక దోష బాటర్ లాగా కలుపుకోవాలి. ఇక గులాబీ పువ్వులు వేయడానికి గులాబీ గుత్తులు తెచ్చుకున్న వెంటనే దానిలో ముంచి వేయకూడదు. ఈ గుత్తిని తీసుకొని ఒక గంట రెండు గంటలు వరకు నూనెలో నానబెట్టుకోవాలి. అప్పుడైతేనే గులాబీ పువ్వులు చాలా ఈజీగా వస్తాయి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుని హీట్ ఎక్కనివ్వాలి.
ఆయిల్ హీటెక్కిన తర్వాత ముందుగా గులాబీ గుత్తిని దానిలో పెట్టి తర్వాత ఇక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దాన్లో ముంచి తర్వాత తీసి నూనెలో ఉంచాలి. అంతే అలాగానే ఆ పువ్వు దాంట్లోకి తీసేసుకుంటుంది. అంతేనండి ఇక నూనెలో ముంచిన తర్వాతనే మళ్లీ పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. లేకపోతే పిండి అసలు వదలదు.. కాబట్టి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆ గులాబీ పువ్వులను రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. అంతే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో సింపుల్ గా ట్రై చేయవచ్చు… ఈ గులాబీ పువ్వులు నూనెల నుంచి తీసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి. తర్వాత చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెలరోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటి రుచి కూడా చాలా చాలా బాగుంటాయి.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.