Gulabi Puvullu Recipe : గులాబీ పువ్వులు ఇలా చేసి చూడండి.. అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా చేసేస్తారు…!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Gulabi Puvullu Recipe : గులాబీ పువ్వులు ఇలా చేసి చూడండి.. అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా చేసేస్తారు…!!

Gulabi Puvullu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులు. ఈ గులాబీ పువ్వులు ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి. జనరల్ గా మనకి ఏదైనా స్నాక్స్ లాగా చేసుకోవాలనుకున్నప్పుడైనా ఇలా చేసి పెట్టుకున్నారు అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇవి మనకి వన్ మంత్ వరకు స్టోర్ కూడా ఉంటాయి. మీరు కూడా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 January 2023,7:40 am

Gulabi Puvullu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులు. ఈ గులాబీ పువ్వులు ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి. జనరల్ గా మనకి ఏదైనా స్నాక్స్ లాగా చేసుకోవాలనుకున్నప్పుడైనా ఇలా చేసి పెట్టుకున్నారు అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇవి మనకి వన్ మంత్ వరకు స్టోర్ కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.. ఈ గులాబీ పువ్వులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి, గోధుమపిండి, పంచదార, యాలకుల పొడి, ఉప్పు కొబ్బరిపాలు, నీళ్లు, ఆయిల్, మొదలైనవి… దీని తయారీ విధానం : ఈ గులాబీ పువ్వులు కోసం ముందుగా మిక్సీజార్లో ఒక కప్పు పంచదార వేసి దాన్లో యాలకులు కూడా వేసి మంచిపొడిలా చేసి పెట్టుకోవాలి. ఈ చక్కెర పొడిని ఒక గిన్నెలో పోసుకోవాలి.

ఇక ఈ పంచదార మిశ్రమంలోకి బియ్యం పిండి రెండు కప్పులు వేసుకోవాలి.అలాగే దానిలో ఇంకొక కప్పు గోధుమపిండి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు కొబ్బరి పాలు పోసుకోవాలి. తర్వాత ఇంకొక కప్పు నీటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు కొబ్బరి పాలు పడతాయి. వీటిని పోసి విస్కర్ తీసుకొని ఒకటే వైపు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా ఉండకూడదు. మరీ పల్చగా ఉండొద్దు.. ఒక దోష బాటర్ లాగా కలుపుకోవాలి. ఇక గులాబీ పువ్వులు వేయడానికి గులాబీ గుత్తులు తెచ్చుకున్న వెంటనే దానిలో ముంచి వేయకూడదు. ఈ గుత్తిని తీసుకొని ఒక గంట రెండు గంటలు వరకు నూనెలో నానబెట్టుకోవాలి. అప్పుడైతేనే గులాబీ పువ్వులు చాలా ఈజీగా వస్తాయి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుని హీట్ ఎక్కనివ్వాలి.

How To Make Gulabi Puvullu Recipe In Telugu

How To Make Gulabi Puvullu Recipe In Telugu

ఆయిల్ హీటెక్కిన తర్వాత ముందుగా గులాబీ గుత్తిని దానిలో పెట్టి తర్వాత ఇక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దాన్లో ముంచి తర్వాత తీసి నూనెలో ఉంచాలి. అంతే అలాగానే ఆ పువ్వు దాంట్లోకి తీసేసుకుంటుంది. అంతేనండి ఇక నూనెలో ముంచిన తర్వాతనే మళ్లీ పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. లేకపోతే పిండి అసలు వదలదు.. కాబట్టి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆ గులాబీ పువ్వులను రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. అంతే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో సింపుల్ గా ట్రై చేయవచ్చు… ఈ గులాబీ పువ్వులు నూనెల నుంచి తీసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి. తర్వాత చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెలరోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటి రుచి కూడా చాలా చాలా బాగుంటాయి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది