Karivepaku Rasam Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు ఈకరివేపాకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకుతో కూడా ఈరోజు మంచి టేస్టీగా రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేసి చూడండి… దీనికి కావలసిన పదార్థాలు : టమాటాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఆయిల్, చింతపండు, ఇంగువ, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, మొదలైనవి… ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత బాగా పిసికి రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు రసం పొడి కోసం ఇలా స్టౌ పైన ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక్క చిటికెడు మెంతులు, జస్ట్ ఒక చిటికెడు వేసుకోండి దీంట్లోనే ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు, ఒక అర కప్పు దాకా కరివేపాకు వేసుకోండి. సుమారుగా మీకు ఒక అయిదారు రెమ్మలు దాకా ఉంటుందండి.
దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకుని వేసుకొని ఏవి మాడకుండా కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి. మీకు ఇలా వేయించుకోవడం కష్టం గా అనిపిస్తే కరివేపాకు సపరేట్గా వేయించుకొని ధనియాలు జీలకర్ర ఇవన్నీ సపరేట్గా వేయించుకొని రెండిటిని కలిపి వేసుకోవచ్చండి. కరివేపాకు ఒక ఆకు చేత్తో నలిపితే మీకు పొడిపొడిగా అవ్వాలండి. బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్ లోకి తీసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, దీంట్లోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. రసంలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక మూడు లేదా నాలుగు ఎండు మిరపకాయలు తుంచుకొని వేసుకోండి.
అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా కచ్చాపచ్చాగా దంచి వేసి ఈ పోపుని లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటా ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు కాస్త మెత్త పడేంత వరకు వేయించుకోండి. ఇ టమట ముక్కలు వేసేటప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ రసం పొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ నీలో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఆల్రెడీ మనం కరివేపాకు ధనియాలు జీలకర్ర అన్ని వేయించేసుకొని పొడి చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లో చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం మొత్తం పోసేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు దాకా నీళ్లు పోస్తున్నాను.
అండి మీరు చూసుకొని పోసుకోండి. అంటే పులుపుకి తగ్గట్టు నీళ్లు ఉండాలి. కాబట్టి ఆ పులుపుకి తగ్గట్టే పోసుకోండి అప్పుడే టేస్ట్ బావుంటుంది. రసం అనేది ఇప్పుడు దీంట్లోనే మీరు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు మూడు పొంగులు రానివ్వండి. మరి ఎక్కువ మరిగించేసిన గాని టేస్ట్ అంత బాగుండదు. ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత సరిపోతుంది. ఒక రెండు మూడు పొంగులు వస్తే మీకు ఈ విధంగా కాస్త మరుగుతుంది అండి ఇలా మరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మరి ఎక్కువ మరిగించేసుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసేసి మీకు లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి నేనైతే కొత్తిమీర వేయడం లేదు ఈ రసానికి కొత్తిమీర లేకపోయినా బానే ఉంటుంది. అంతే అండి చాలా సింపుల్ కదా కరివేపాకు తోటి రసం పెట్టుకోవడం వేడివేడి రైస్ లోకి చాలా బాగుంటాయి. కరివేపాకు కూడా హెల్త్ కు మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.