Prabhas : ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ దాదాపు ఐదు వందల కోట్లు. ఇటీవల ఈ సినిమాకి సంబంధిచిన టీజర్ విడుదల చేయగా, దాంతో మూవీపై మంచి హైప్ వస్తుందని అనుకున్నారు. కాని టీజర్ కొంప కొల్లేరు చేసింది. టీజర్‌ను చూసి ప్రతీ ఒక్కరూ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌పై తిట్ల పురాణం కురిపించారు. రాముడు, రావణుడు, ఆంజనేయుడు, వానర సైన్యం ఇలా ఉంటుందా? అంటూ పాయింట్ పాయింట్‌ను తెగ ట్రోల్స్ చేశారు. ఈదెబ్బతో ఓం రౌత్ మళ్లీ రిపేర్లు చేసేందుకు పూనుకోగా,
రిపేర్ల కోసం వంద కోట్లు ఖర్చు చేస్తున్నాడట.టీజర్ రిలీజ్ అయిన సమయంలో సినిమాకి సంబంధించి తెగ ట్రోలింగ్ జరగగా, రాను రాను అది కాస్త సద్దుమణిగింది. అయితే రీసెంంట్‌గా హనుమాన్ టీజర్ విడుదలయ్యాక మళ్లీ సినిమాపై ట్రోల్స్ మొదలయ్యాయి. హనుమాన్ టీజర్ చూశాక.. మన తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్కడున్నాడు.. ఏ స్థాయిలో విజువలైజ్ చేసుకున్నాడు..ఆ హిందీ డైరెక్టర్ ఏం ఆలోచించాడు.. ఏం తీశాడు అన్న దానిని పట్టకొని ట్రోల్స్ చేస్తున్నారు. ప్రభాస్ అస్సలు నీకు బుద్దుందా.. మన దగ్గర ఇలాంటి మంచి డైరెక్టర్స్ ఉంచుకొని పోయి పోయి హిందీ వాడితో సినిమా తీసి చేతులు
కాల్చుకుంటున్నావు అని తిట్టి పోస్తున్నారు. టీజర్‌లో హనుమాన్‌ను చూపించిన తీరు అదిరిపోయిందంతే. వాటర్ ఫాల్స్, విశ్వం, అంతరిక్షం ఇలా అన్నీ కూడా అద్భుతంగా చూపించారు. చివరి షాట్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి.. కథ ఏంటన్నది స్పష్టంగా చెప్పకపోయినా కూడా ఏదో కొత్తగా ట్రై చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ అంటూ ఇలా పార్టులు తీస్తూనే ఉంటాడని చెప్పొచ్చు. అయితే హనుమాన్ టీజర్ అంత అద్భుతంగా ఉండగా, ఆదిపురుష్ అలా బెడిసి కొట్టడంపై ప్రస్తుతం చర్చ విపరీతంగా నడుస్తుంది
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.