
Natukodi Pulusu Recipe : పక్కా పల్లెటూరి స్టైల్ నాటుకోడి పులుసు ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది...!
Natukodi Pulusu Recipe : ఈరోజు విలేజ్ స్టైల్ లో నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను.. నాటుకోడి పులుసు అని చెప్పగానే నోరూరిపోతుంది కదండి.. టేస్ట్ అంత బాగుంటుంది. మరి దీంతో పాటు మినప గారెలు కాంబినేషన్ ఉంటే అబ్బా దాని టేస్టే వేరండి. మీరందరు కూడా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్ లో ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకు మరి ఈ నోరు ఊరించే నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా.. దీనికి కావలసిన పదార్థాలు: నాటుకోడి చికెన్, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, గరం మసాలా, ధనియాల పౌడర్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ,ఆయిల్, కొత్తిమీర, టమాటాలు మొదలైనవి.. తయారీ విధానం; మరి చేయడానికి ముందుగా పొయ్యిని వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత మీరు ఎందులో కూర ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో.. ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టేసుకోండి. తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బాగా హీట్ అవ్వాలండి. హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు మిరియాలనే యాడ్ చేసుకోండి. మిరియాలు యాడ్ చేసిన తర్వాత ఒక నాలుగు లవంగాలు, రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఒక బిర్యాని ఆకు లేదా రెండు బిర్యాని ఆకుల్ని మధ్యలోకి కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి వరకు ఇలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి.
పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. నాటుకోడి పులుసుకి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి ఆడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్ గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలండి. ఒక ఐదు నిమిషాలు అయినా సరే టైం పడుతుంది. ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి.. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. నాటుకోడి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల వరకు అయినా సరే మూత పెట్టేసి మగ్గించండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి నాటు చికెన్ ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 750 g చికెన్ ని తీసుకున్నాను అంటే ముప్పావు కేజీ అన్నమాట. ఈ చికెన్ ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ని మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ముగించాలండి. టెన్ మినిట్స్ తర్వాత ఈ చికెన్ నుంచి నాచురల్ గా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేయండి.
యాడ్ చేసిన తర్వాత ఈ ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టేంతవరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగే మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక పది నిమిషాల వరకు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూడండి. చికెన్ నుంచి వాటర్ మొత్తం బయటికి వచ్చేసింది. ఇలాగా చికెన్ లో లైట్ గా వాటర్ ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజ్ టొమాటోస్ ని చిన్న ముక్కలు లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి.యాడ్ చేసి టమాటో కూడా చక్కగా సాఫ్ట్ గా అయ్యేంతవరకు మగ్గించుకోండి. మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయినా సరే టైం పడుతుంది. ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి. టమాటో కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్ కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నాటుకోడి కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇలాగే రెండు నిమిషాలు ఉడకనివ్వండి. అప్పుడు కారంలోని పచ్చి వాసన పోతుంది. తర్వాత చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి.. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు ఉడకనివ్వండి. అప్పుడు చికెన్ మనకి 100% కుక్ అయిపోతుంది. ఒక 15 నిమిషాల వరకు ఉడికించాలి.
ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ లో వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇక తర్వాత దింపేముందు కొత్తిమీరను వేసి దింపుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది.. నాటుకోడి చికెన్ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో.. కాకపోతే కొంచెం టైం పడుతుంది. కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది..
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.