Rava Laddu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి గుడిలో ప్రసాదంలా రవ్వ లడ్డు. జనరల్ గా ఈ రవ్వ లడ్డుని చేసుకునేటప్పుడు చాలామందికి చాలా గట్టిగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా చాలా మృదువుగా మెత్తగా ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.. ఈ టిప్స్ ను పాటిస్తే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. ఈ కొలతలతో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి. ఈ మృదువైన రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం… దీనికి కావాల్సిన పదార్థాలు : బొంబాయి రవ్వ, పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి, నెయ్యి మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక అర కప్పు కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని
దానిలో ఒక కప్పు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత దానిలో మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకోవాలి. అలా పాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టి దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని రెండు భాగాలు చేసుకుని చపాతీ లాగా దానిలో ఒత్తుకొని రెండు వైపులా కాల్చి తీసి పక్కన పెట్టుకోవాలి. అన్ని అలా చేసిన తర్వాత అవి చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నాలుగైదు యాలకులు తర్వాత ఒక కప్పు పంచదార వేసుకొని మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ జార్ లో వేసి పౌడర్లా చేసుకుని తీసుకోవాలి. ఇక ఈ పౌడర్ ని పంచదార పౌడర్లో వేసి కలుపుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ని అన్నిటిని నెయ్యిలో వేయించి వాటిని కూడా తీసి ఈ మిశ్రమంలో వేసి ఇక లడ్డూల చుట్టుకోవడమే అంతే ఎంతో సింపుల్గా నెయ్యి లేకుండా లడ్డూల్ని ఈజీగా చుట్టుకోవచ్చు. ఈ లడ్డూలు సేమ్ దేవుడి ప్రసాదం లడ్డూల మృదువుగా చాలా మెత్తగా టేస్టీగా వస్తాయి. నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతాయి. ఇవి నెలరోజులపాటు నిల్వ కూడా ఉంటాయి.
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.