Ginger Tea : ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన టీ ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం.. అయితే చాలామందికి టీ అన్నిసార్లు ఒకే విధంగా కుదరదు.. అయితే చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. టీలో ఎక్కువ పాలు పోయాలా.. టీలో చక్కెర ఎంత వేస్తే సరిపోతుంది. లేదా టీ చిక్కదనం కోసం ఏం వాడాలి. అని ఎన్నో రకాల డౌట్స్ చాలా మనస్లో ఉంటాయి. అయితే ఇప్పుడు చిక్కని టెస్ట్ అయిన టీ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకోబోతున్నాం… టీ తయారీ విధానం కోసం : కావలసిన పదార్థాలు : నీళ్లు, పాలు, చక్కెర, అల్లం, టీ పౌడర్, లవంగాలు,యాలకులు మొదలైనవి…
తయారీ విధానం : ముందుగా ఈ మసాలా టీ కోసం మూడు యాలకుల్ని తీసుకొని రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఈ యాలకులు దంచిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే రోట్లో 4 5 ఇంచల అల్లం కూడా పొట్టు తీసి దానిని కూడా దంచుకోవాలి. ఇక అల్లం కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై టీ గిన్నెను పెట్టుకుని దానిలో మూడు గ్లాసుల వాటర్ న్ని పోసి ముందుగా దంచి పెట్టుకున్న అల్లం ముక్కలు లవంగాలు, యాలకులు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా వాటర్ చేంజ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ విధంగా మరుగుతున్న నీటిలో మూడు స్పూన్ల టీ పౌడర్ ని వేసి కలుపుకోవాలి.
తర్వాత మూడు స్పూన్ల చక్కెర ని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ బాగా మరిగించుకోవాలి. డికాషన్ బాగా మరిగిన తర్వాత మూడు గ్లాసుల పాలు పోసుకోవాలి. ఈ పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. పాలు డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అసలు పోసుకోకూడదు. రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలైతేనే టీ కి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే చిక్కదనం కూడా ఉంటుంది. ఇక కాసేపు బాగా మరగనివ్వాలి. అలా మరిగిన టీని తీసి చక్కగా గ్లాసుల్లో వడకట్టుకుని వేడివేడిగా తాగాలి. అంతే ఎంతో సింపుల్ గా చిక్కని టీ అలాగే ఎంతో టేస్టేఅయిన టీ రెడీ. ఈ టిప్స్ తో టీ ని చేసుకుంటే ఎప్పుడు ఒకటే లాగా చాలా చిక్కగా టేస్టీగా ఉంటుంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.