Rice Flour : గోధుమపిండి, మైదా వాడకుండా.. ఇలా వరి పిండితో పూరి చేసి తిన్నారంటే ఆహా అనాల్సిందే...!
బియ్యప్పిండితో పూరి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు.. మీ పిల్లల కోసం ఏదైనా కొత్తగా రెసిపీ చేయాలనుకుంటే బియ్యప్పిండితో ఇలా ఒకసారి పూరిని ట్రై చేసి చూడండి.. ఇది చాలా అంటే చాలా బాగుంటాయి.. ఇందులోకి బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. బియ్యప్పిండితో పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి, జీలకర్ర, వాము, నువ్వులు, ఉప్పు, ఆయిల్ ,వాటర్ మొదలైనవి… తయారీ విధానం; ఒక మిక్సింగ్ బౌల్ లోకి 3 కప్స్ వరకు బియ్యప్పిండి ని తీసుకోవాలి. మీకు పూరీలు ఎన్ని కావాలనుకుంటే అంత క్వాంటిటీలో బియ్యప్పిండిని ఆడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ని ఆడ్ చెయ్యాలి. అలానే వాముని కొద్దిగా చేత్తో నలిపి ఆడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి నువ్వుల్ని కూడా యాడ్ చేయాలి.నువ్వులు వద్దనుకునేవాళ్లు స్కిప్ చేసుకోండి. ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి. లేదంటే పూరీలు అనేవి సరిగ్గా రావు. మనం ఆయిల్ లో వేసేటప్పుడు విరిగిపోతాయి.
సో మీకు ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ ని ఆడ్ చేయకండి. కన్సిస్టెన్సీ ని బట్టి వాటర్ ని కొద్దికొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేశాక పిండిని కొద్దిసేపు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పూరీలు అనేవి చాలా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. మీకు పూరికి కావాల్సిన సైజుని బట్టి ఈ బాల్స్ ని ప్రిపేర్ చేసుకోండి. పిండినంత ఒక దాని తర్వాత ఒకటి రౌండ్ బాల్స్ లాగా చేసి ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పూరీస్ ని ప్రిపేర్ చేసుకుందాం. పూరి ప్రెస్సర్ లోకి ఒక్కొక్క బాల్ ని పెట్టి ప్రెస్ చేసుకోండి. ఈ పూరీలు అనేవి చాలా దప్పంగా ఉండకూడదు. అలా అని చాలా పల్చగా కూడా ఉండకూడదు. చాలా పల్చగా ఉంటే మనం తీసుకొని వేసేటప్పుడు ఆయిల్ లోకి విరిగిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ప్లాస్టిక్ కవర్ కి కొద్దిగా ఆయిల్ రాసి పూరిలను ప్రెస్ చేసుకోండి.
అప్పుడు పూరీలు అనేవి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పూరీస్ ని ఆయిల్ లోకి వేసుకోండి.ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఈ పూరీకి డ్రాప్ చేసుకోండి. ఆయిల్ రాయడం వల్ల ప్లాస్టిక్ పేపర్ కి పూరిస్ అనేవి నీట్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు పూరీస్ ని డ్రాప్ చేసుకొని లైట్ గా పైన ప్రెస్ చేస్తే పూరీ అనేది పొంగుతుంది. వీటిని టూ సైడ్స్ తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూరీస్ అనేవి ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి. చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ తో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులోకి బీరకాయ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.