Sankranti Festival Recipe : ఈ సంక్రాంతికి చాలా సులభంగా ది బెస్ట్ పిండి వంటలు చేసేయొచ్చు. అన్ని తెలిసిన రెసిపీలే కాబట్టి ప్రతి రెసిపీ కొత్తగా మరింత ఎక్స్ట్రా రుచితో ఉంటాయి. ఇక ఈ రెసిపీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. ముందుగా బూందీ లడ్డు: బూందీ లడ్డు కోసం ఆఫ్ కేజీ శనగపిండిని తీసుకుని జల్లించి దాంట్లో నీటిని పోసి జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టి నన్ను అరకేజీ పంచదార పోసుకొని 700 ml నీళ్లు పోసి తీగ పాకం వచ్చిన తర్వాత ఆ పాకాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత మరిగే నూనెలో శనగపిండి గరిటతో తీసుకొని చిల్లుల గరిటలో వేసి బూందీ వేసుకోవాలి. ఇక ఈ బూందీని ఎర్రగా కాల్చకుండా కొద్దిసేపు వేసి మెత్తగా ఉండగానే తీసి దానిని వెంటనే పాకంలో వేసి కలుపుకోవాలి. ఇక పాకంలో కిందికి పైకి ఒకసారి కలుపుకోవాలి. ఇక తర్వాత తర్వాత దానిలో డ్రైఫ్రూట్స్ వేసుకుని లడ్డు చుట్టుకోవడమే అంతే లడ్డు రెడీ. తర్వాత రెసిపీ
గవ్వలు: గవ్వల కోసం పావు కేజీ బొంబాయి రవ్వ లో రెండు స్పూన్ల పాలపొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక పావు కేజీ గోధుమపిండిలో మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని కొంచెం నెయ్యి, కొంచెం సోడా ఉప్పు వేసి, కొన్ని నీళ్లను వేసి బాగా మెత్తగా పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇక తర్వాత ఈ పిండి ముద్దని మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ మూడు భాగాలుగా చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వల మాదిరిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మనం ముందుగా బూందీని వేయించుకున్న ఆయిల్ లో ఈ గవ్వలు కొన్ని కొన్నిగా వేస్తూ మీడియంలో పెట్టి మంచి కలర్ వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. ఇక ఈ గవ్వల కోసం కప్పున్నర బెల్లం తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల నీళ్లను పోసి గట్టి పాకం తీసుకోవాలి. ఇక గట్టిగా ఉండలా అయిన తర్వాత ఈ పాకంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వలు ను వేయాలి. పదినిమిషాల పాటు ఉంచిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఇక అంతే బెల్లం గవ్వలు రెడీ..
రిబ్బన్ పకోడా: ఒక కప్పు బియ్యప్పిండిలో అరకప్పు శెనగపిండి, అరకప్పు పుట్నాల పొడి ఒక రెండు స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసి మంచిగా జల్లించుకోవాలి. తర్వాత కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర వేయాలి. ఇక తర్వాత వేడి వేడి నూనె ఒక స్పూన్ వేసి ఇక తర్వాత నీటిని వేసి మృదువుగా గట్టిగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇక నూనె హీటెక్కిన తర్వాత మరలో పిండిని పెట్టుకుని రెబ్బెన పకోడా వత్తి ఎర్రగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవడమే అంతే రిబ్బన్ పకోడా రెడీ.
మిక్చర్: ఇక దీనికోసం ఒక కప్పు శెనగపిండి, 100 గ్రాముల బియ్యప్పిండి, ఇక ఈ పిండిలో రుచికి సరిపడిన కొంత ఉప్పు, కొంచెం కారం వేసి తర్వాత కొన్ని నీటిని వేసి మృదువుగా ఒత్తుకోవాలి. ఇక తర్వాత మిక్చర్ లోకి బూందీ కావాలి కాబట్టి ఒక కప్పు పిండి వేసి దానిలో కొంచెం సోడా వేసి జారుగా పిండిని కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న కారపూస పిండిని మరలో పెట్టి వేడి వేడి ఆయిల్ లో కారపూస వట్టి తర్వాత క్రిస్పీగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక అదే ఆయిల్లో బూందీ పిండిని గరిటలో వేసి బూందీ వొత్తి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఈ మిక్సర్ లోకి పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు వేసి ఎర్రగా వేయించుకొని తీసి బూందీలో వేసుకోవాలి. ఇక తర్వాత కాన్ ఫ్లెక్స్ కూడా వేసి వేయించి బూందీలో వేసుకోవాలి. ఇక తర్వాత అటుకులను కూడా వేసి వేయించి బూందీలో వేసుకొని ఇక కారపూస కూడా వేసుకొని అన్ని పైకి కిందకి కలుపుకొని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి నెమ్మదిగా కలిపితే మిక్షర రెడీ అయిపోతుంది.
ఇక తర్వాత కజ్జికాయలు: కజ్జికాయలలోకి స్టఫింగ్ కోసం కొంచెం నెయ్యి వేసి అరకప్పు జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వని వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసి వేయించు కోవాలి. తర్వాత అర కప్పు పంచదార పాకం పోసి మంచిగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి బాగా కలుపుకొని పొడిపొడి లాడే వరకు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక కజ్జికాయలు కోసం పావు కిలో మైదా పిండిని జల్లించుకున్నటువంటి పిండిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల శెనగపిండి, అరకప్పు నెయ్యిని వేసి పిండిని గట్టిగా నీటిని వేసి తడిపి పెట్టుకోండి. ఇక ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకుని పూరీ మాదిరిగా మరీ పల్చగా మరి చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఒత్తుకొని ఇక వాటిని మరలో పెట్టి మన ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పెట్టి అన్నీ కజ్జికాయలను చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత ఆయిల్ హీటెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నాలుగైతే గజ్జి కాయలు వేసి నెమ్మదిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసుకోవడమే అంతే సింపుల్గా అన్ని పిండి వంటలు సంక్రాంతికి రెడీ అయిపోయాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.