Semiya Payasam Recipe in telugu
Semiya Payasam Recipe : ఈరోజు మనం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని తయారు చేసుకొని చూద్దాం… దివాలి పండుగ కూడా వచ్చేస్తుంది కదా.. ఇక ఇంటికి వచ్చిన అతిధులకి ఈ స్వీట్ చేసి పెట్టారంటే ఫిదా అవ్వాల్సిందే.. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీ స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : గులాబ్ జామ్ పిండి, సేమ్యా, పంచదార యాలకుల పొడి, ఆయిల్, జీడిపప్పు, కిస్ మిస్ లు నెయ్యి, పాలు మొదలైనవి.. దీని తయారీ విధానం ; ముందుగా గులాబ్ జామూన్ పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసి బాగా స్మూత్ గా కలిపి పక్కన ఉంచుకోవాలి.
తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని దానిలో గులాబ్ జామున్లు పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల పంచదారను తీసుకొని ఆ పాన్ లో వేసుకొని రెండు కప్పుల నీళ్లను వేసి కొంచెం స్టికిగా అయ్యేవరకు పాకాన్ని చేసుకోవాలి. తర్వాత దానిలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అలా స్టికిగా అయిన తర్వాత స్టవ్ ఆపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న బాల్స్ లా చేసుకొని డిప్రెకి ఆయిల్ పెట్టుకొని దాంట్లో వేసి ఎర్రగా వేయించి షుగర్ సిరప్ లో వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఇంకొక పాన్ పెట్టుకుని దానిలో కొంచెం నెయ్యి వేసి దానిలో జీడిపప్పు, కిస్మిస్లను ఎర్రగా వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి.
Semiya Payasam Recipe in telugu
తర్వాత అదే కడాయిలో సేమ్యా వేసి వేయించుకొని దానిలో మూడు కప్పుల పాలను వేసి సేమియా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత గులాబ్ జామున్లు సిరప్ ని బాగా పీల్చుకున్న తర్వాత దానిలో నుంచి షుగర్ సిరప్ ని తీసేసి ఆ సిరప్ ని ఈ సేమియాలో కొద్దికొద్దిగా పోసుకుంటూ పల్చగా అయ్యేవరకు కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని దాంట్లో వేసి కొంచెం యాలకుల పొడి కూడా వేసి ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జాముల్ని కూడా దాంట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కీర్ గులాబ్ జామున్ లు రెడీ. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ దివాళి పండక్కి వచ్చిన బంధువులకి ఒక్కసారి పెట్టారంటే వాళ్లు ఫిదా అవ్వాల్సిందే…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.