Mutton Fry Recipe : మటన్ వేపుడు ముక్క మెత్తగా ఉండి మంచి రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి...!
Mutton Fry Recipe : మటన్ వేపుడు చేయాలి అనుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ముక్క మెత్తగా భలే ఉంటుంది. ఈ మటన్ వేపుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి తయారీ విధానాన్ని చూసేయండి.. దీని కావాల్సిన పదార్థాలు: మటన్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, గరం మసాలా, జీలకర్ర పౌడర్, కసూరి మేతి, కొత్తిమీర,ఆయిల్, బిర్యానీ ఆకు, నిమ్మరసం మొదలైనవి..
తయారీ విధానం: ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. ఈ మటన్ ని శుభ్రంగా కడగండి. కడిగేసిన తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్ లో వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ ల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక మూడు లవంగాలు 1 నుంచి చెక్క ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. కుక్కర్ కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆరు లేదా ఏడు విజిల్స్ రానివ్వండి. మటన్ బాగా మెత్తగా ఉడకాలి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కాస్త ముదురుదైతే ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రానివ్వండి.. ఇక స్టవ్ ఆపుకుని కుక్కర్ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టౌ పై ఓ కడాయి పెట్టుకొని ఆ కడాయిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్ తో సహా కడాయిలో వేసుకోవాలి.. ఇక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నీరంతా ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత మళ్లీ 15 నిమిషాల పాటు మటన్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత లాస్ట్ లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి దీనికి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా టేస్టీగా మటన్ ఫ్రై రెడీ అవుతుంది..
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
This website uses cookies.