Mutton Fry Recipe : మటన్ వేపుడు ముక్క మెత్తగా ఉండి మంచి రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mutton Fry Recipe : మటన్ వేపుడు ముక్క మెత్తగా ఉండి మంచి రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి…!

 Authored By aruna | The Telugu News | Updated on :17 February 2024,1:30 pm

ప్రధానాంశాలు:

  •  Mutton Fry Recipe : మటన్ వేపుడు ముక్క మెత్తగా ఉండి మంచి రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి...!

Mutton Fry Recipe : మటన్ వేపుడు చేయాలి అనుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ముక్క మెత్తగా భలే ఉంటుంది. ఈ మటన్ వేపుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి తయారీ విధానాన్ని చూసేయండి..  దీని కావాల్సిన పదార్థాలు: మటన్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, గరం మసాలా, జీలకర్ర పౌడర్, కసూరి మేతి, కొత్తిమీర,ఆయిల్, బిర్యానీ ఆకు, నిమ్మరసం మొదలైనవి..

తయారీ విధానం: ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. ఈ మటన్ ని శుభ్రంగా కడగండి. కడిగేసిన తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్ లో వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ ల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక మూడు లవంగాలు 1 నుంచి చెక్క ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. కుక్కర్ కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆరు లేదా ఏడు విజిల్స్ రానివ్వండి. మటన్ బాగా మెత్తగా ఉడకాలి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కాస్త ముదురుదైతే ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రానివ్వండి.. ఇక స్టవ్ ఆపుకుని కుక్కర్ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టౌ పై ఓ కడాయి పెట్టుకొని ఆ కడాయిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.

కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్ తో సహా కడాయిలో వేసుకోవాలి.. ఇక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నీరంతా ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత మళ్లీ 15 నిమిషాల పాటు మటన్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత లాస్ట్ లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి దీనికి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా టేస్టీగా మటన్ ఫ్రై రెడీ అవుతుంది..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది