Electorol Bond : అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి..?దానిని సుప్రీంకోర్టు ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంది..?ఎలక్టోరల్ బాండ్స్ వెనుక దేశానికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటిి లాభం ఏంటి అనే సందేహాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి.అయితే దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… అయితే ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఒక ప్రాంసరీ నోట్ లాంటివి అని చెప్పాలి. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అందుబాటులో రాకముందు విషయం గురించి మాట్లాడుకుంటే…ఒక రాజకీయ పార్టీకి ఒక బిజినెస్ మాన్ లేదా సామాన్యులు డబ్బులు ఇస్తారు. ఇలాంటి లెక్కలు అన్నీ కూడా లిమిట్ ప్రకారం ఉండాలి. ఇచ్చిన తర్వాత ప్రతి దానికి కచ్చితంగా ఒక లెక్క ఉండాలి. అలాగే ఎంతమంది, ఎంతవరకు ,ఎంత ఇవ్వాలి అని చాలా రకాల రూల్స్ ఉండేవి.
ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు ఒక వంద రూపాయలు తీసుకుంటే దానిలో 5 రూపాయలు మనకోసం వినియోగించి మిగిలిన 95 రూపాయలను వారి వెనుక వేసుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ నాయకులు చేసే రాజకీయాలలో ఇది ఒక పద్ధతి అని చెప్పాలి. ఇక ఇది కాకుండా మరో పద్ధతి ఏమైనా ఉందా అంటే…ఏదైనా పెద్ద కార్పొరేట్ కంపెనీల నుండి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏదైనా మంచి చేయడం వంటివి చేస్తుంటారు. అందుకే చాలా సందర్భాలలో కార్పొరేట్ కంపెనీలు పార్టీలకు ఫండ్స్ రూపం లో మనీ ఇస్తూ ఉంటాయి. ఇలా కార్పొరేట్ కంపెనీలు పార్టీలకు ఇస్తున్నటువంటి క్రమంలో లిమిట్ పెట్టడం జరిగింది. దీంతో ఈ లిమిట్ ను కనిపించకుండా చేసే ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ అనే కొత్త అంశాన్ని రాజకీయ నాయకులు తెర మీదకు తీసుకొచ్చారు.
అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఎస్బిఐ బ్యాంక్స్ లో దొరుకుతాయి. ఇక ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ ఉపయోగించి ఒక పార్టీకి ఫండ్స్ రూపంలో ఇస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇచ్చే వారి వివరాలను బయట పెట్టకుండా ఒక చట్టం రూపొందించుకున్నారు. అంటే ఆ పార్టీకి ఎవరు ఎంత ఇస్తున్నారు అనే విషయాలను అస్సలు బయట పెట్టరు అన్నమాట. దీంతో పెద్ద ఎత్తున దేశంలో బ్లాక్ మనీ చేతులు మారుతున్నాయని తెలుస్తోంది.ఇక ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న కొందరు ఇది కర్రెక్ట్ పద్దతి కాదని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీంతో ఈ కేసు పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇది సరైన పద్ధతి కాదంటూ తీర్పును వెలువరించింది. అంతేకాక ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు ఎంత ఇచ్చారు అనే విషయాలను కూడా బయట పెట్టాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాజకీయ నాయకులు దీనికి ప్రత్యామ్నాయంగా మరో పద్ధతిని ఎంచుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోరు, పాటించరని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కోసం ఇలాంటి కొత్త చట్టాలను ఎన్నైనా తీసుకొస్తారు అంటూ కొందరు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.