Gongura Chicken : సండే స్పెష‌ల్‌.. గోంగూర చికెన్ ఇలా చేస్తే ఒక్క పూటకే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు…!

Gongura chicken : ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం…అన్నంలోకి అయిన,చాపతిలోకి ఆయిన బిర్యానీ లోకి అయిన సూపర్ గా ఉంటుంది… ఈ గోంగూర చికెన్ ఇలా చెస్తే ఒక్క పుటకేగిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..ఇక ప్రాసెస్ లో వెళ్దాం..  దీనికి కావాల్సిన పదార్థాలు: గోంగూర,చికెన్, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం అల్లంవెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి.గరంమసాలా, ఉల్లిపాయలు, టమాటాలు,ఆయిల్, మొదలైనవి.. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో గోంగూరిని ఆడ్ చేసుకోవాలి. ఉట్టి ఆకలి మాత్రమే వేసి ముగించుకోవాలి అనమాట. మెత్తగా సాఫ్ట్ గా అయిపోయేంత వరకు కూడా మూత పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మ్యాచ్ చేసేసుకుని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టేసుకోండి.  ఇప్పుడు అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక చిన్న బిర్యాని ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు వేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ముప్పావు కప్పు దాకా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి.

ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర సన్నగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇలా వేగాక ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను తీసుకుని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక టీస్పూన్ దాకా ఉప్పు వేసేసి అంతా కూడా మిక్స్ చేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్ గా మెత్తగా మగ్గిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇలా టమాట ముక్కలు అనేవి సాఫ్ట్ గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ కేజీ దాకా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోండి. ఇలా చికెన్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మగ్గిస్తే చికెన్ పీసెస్ మంచిగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా వేయండి.తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి కంప్లీట్ గా చికెన్ అంతా కూడా బాగా ఉడికి పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మగ్గించుకుని పెట్టుకున్న గోంగూర ఫేస్ట్ ని వేసేసి చికెన్ కి గోంగూర అంతా కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. అంత కూడా బాగా కలుసుకోవాలి. గోంగూర చికెన్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి మిక్స్ చేయండి.

ఇప్పుడు మూత పెట్టి వెంటనే లో ఫ్లేమ్ లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది.ఇక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఫైనల్ గా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకోండి. తర్వాత ఫైనల్ గా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసుకుని ఐదు నిమిషాల తర్వాత స్టవ్ పై నుంచి దింపి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా గోంగూర చికెన్ రెడీ.చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది. చపాతీతో తిన్న బాగుంటుంది. బిర్యానిలోకి కూడా చాలా బాగుంటుంది.

Recent Posts

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

2 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

4 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

6 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

7 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

8 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

9 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

10 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

11 hours ago